
గరిష్ట ఉష్ణోగ్రత 40.7 డిగ్రీలు
సిటీబ్యూరో: నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ వేడిమికి తోడు వేడిగాలులు నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మంగళవారం గరిష్టంగా 40.7 డిగ్రీలు..కనిష్టంగా 24.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది.