న్యూఢిల్లీ: రోజురోజుకి భానుడి భగభగలు ఎక్కువైపోతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో వేడి అంతకంతకు పెరిగిపోతోంది. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని, మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుందని వెల్లడించింది.
ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, విదర్భ, ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలలో ఈరోజు, రేపు వేడిగాలుల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ ఏడాది దేశంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుందని ఐఎండీ ఇటీవల అంచనా వేసింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీని కారణంగా హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరిగిందని ఇప్పటికే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment