న్యూఢిలీ: ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్ నెలలో తొమ్మిది రోజులు నమోదైన అధిక ఎండలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రజలు అల్లాడిపోయారు. ఈ విషయాన్ని తాజాగా అమెరికాకు చెందిన ‘క్లైమెట్ సెంట్రల్’ అనే సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది.
జూన్ నెలలోని 9 రోజులు అధిక ఉష్ణోగ్రత నమోదై.. ఎండలు మండిపోవటంతో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 కోట్లమంది, భారత్‌లో 61.9 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది.
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చైనాలో 57.9 కోట్ల మంది, ఇండోనేషియాలో 23.1 కోట్ల మంది, నైజిరియాలో 2.06 కోట్ల మంది, బ్రెజిల్‌లో 1.76 కోట్లమంది, బంగ్లాదేశ్‌లో 1.71 కోట్ల మంది, అమెరికా 1.65 కోట్లమంది, యూరోప్‌లో 1.52 కోట్ల మంది, మెక్సికోలో 1.23 కోట్ల మంది, ఎథియోపియాలో 1.21 కోట్ల మంది, ఈజిప్ట్‌లో 1.03 కోట్ల మంది ప్రజలు జూన్‌లో తొమ్మిది రోజల ఎండ వేడిని ఎదుర్కొన్నారని వెల్లడించింది.
వాతావరణ మార్పుల కారణంగా జూన్ 16 నుంచి 24 తేదీల మధ్య రోజుల్లో ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం మంది మూడుసార్లు అధిక ఎండకు ప్రభావితం అయ్యారని పేర్కొంది. ‘‘ సుమారు శతాబ్దం పైగా బొగ్గు, ఆయిల్, నాచురల్ గ్యాస్‌ను మండించటం మూలంగా ప్రపంచానికి అధిక ఎండల ప్రమాదం పెరుగుతోంది. అర్బన్ జనాభాను కట్టడి చేయకపోవటంతో ఈ ఏడాది ఎండాకాలంలో ఎన్నడూ చూడని ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా నమోదు అయ్యాయి’’ అని క్లైమెట్ సెంట్రల్ చీఫ్ ఆండ్రూ పెర్షింగ్ తెలిపారు.
అదే విధంగా జూన్ 16నుంచి 24 వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4. 97 వందల కోట్ల మంది మూడు సార్లు తీవ్రమైన ఎండకు ప్రభావిత అయినట్లు క్లైమెట్ ఫిఫ్ట్ ఇండెక్స్ (సీఎస్‌ఐ)తెలిపిందన్నారు. భారత్‌లో అధిక ఉష్ణోగ్రత, తీవ్రమైన వేడి గాలులు రికార్డుస్థాయిలో నమోదైనట్ల రిపోర్టులో వెల్లడించింది. ఉష్ణోగ్రత, వేడి గాలులు కారణంగా సుమారు వంది మంది మరణించగా, 40 వేల మంది వడదెబ్బ తగిలిన కేసులు నమోదయ్యాయిని తెలిపింది. అధిక ఎండ, వడగాలులతో దేశరాజధాని ఢిల్లీ నీటి సంక్షోభం, పవర్ కట్ సంభవించినట్లు పేర్కొంది. అదేవిధంగా సౌది అరేబియాలో సైతం ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ప్రపంచవ వ్యాప్తంగా హజ్ యాత్రకు అక్కడి వచ్చిన సుమారు 1300 మంది ఎండ తీవ్రత కారణంగా మృతి చెందారు.
అదే విధంగా భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్, జూన్ నెలల్లో దేశంలో 40 శాతం మంది సాధారణం కంటే ఎక్కువ వేడి గాలులకు ప్రభావితం అయ్యారని పేర్కొంది. అదీ కాక కొన్ని రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పలు చోటు రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. రాత్రి పూటి ఉష్ణోగ్రత సైతం 35 డిగ్రీల వరకు నమోదైనట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment