128 డిగ్రీల జ్వరం వచ్చింది!
ఫలోడి: మామూలుగా 102-103 డిగ్రీల జ్వరం వచ్చిందంటేనే భరించడం కష్టం. అలాంటిది ఏకంగా 128 డిగ్రీల జ్వరం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఔనండీ.. రాజస్థాన్ లోని ఫలోడి ప్రాంతానికి శుక్రవారం 128 ఫారెన్ హీట్ ఎండతో జ్వరం వచ్చినట్లయింది. దీన్ని సెంటీగ్రేడ్‌లోకి మారిస్తే.. 51 డిగ్రీలు అవుతుంది. ఇప్పటివరకు దేశంలో సంభవించిన అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డులను ఇది బద్దలుకొట్టింది.
ఎండ దెబ్బతో విలవిలలాడిన రాజస్థాన్ వాసులు... తాగునీటి కోసం తహతహలాడారు. ఇక రోజువారీ కూలి చేసుకుని అరకొర వేతనంతో జీవించే వారయితే ఎండ బాగా ఉన్న సమయంలో అంటే మధ్యాహ్నం ఒకటి నుంచి నలుగున్నర గంటల వరకు విరామ సమయంగా ప్రకటించేశారు. వేసవిలో ఎప్పుడూ రికార్డుస్థాయిలో ఎండలు నమోదవుతాయి కానీ.. ఇంతపెద్ద మొత్తంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు వాపోయారు.