Phalodi
-
India Meteorological Department: రాజస్తాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా రాజస్తాన్‌లో ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నా యి. రాజస్తాన్‌లోని ఫలోదీలో తాజాగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత రికా ర్డు కావడం ఐదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2019 జూన్ 1న రాజస్తాన్‌లోని చురూలో 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు ఈశాన్యంలోని అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ ఎండల ధాటికి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాజస్తాన్‌లోని బార్మర్‌లో 48.8, జైసల్మేర్‌లో 48, బికనెర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. పశి్చమ బెంగాల్‌లోని కూచ్ బెహార్లో 40.5 డిగ్రీలు, అస్సాంలోని సిల్చార్‌లో 40, లుమిడింగ్‌లో 43, అరుణాచల్‌లోని ఈటానగర్‌లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
Lok Sabha Election 2024: ఫలోదీ సట్టా బజార్లో... తగ్గిన బీజేపీ హవా
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై రాజస్తాన్‌లోని ఫలోదీ సట్టా బజార్ తాజా అంచనాలు ఎలా ఉన్నాయి? కచి్చతమైన అంచనాలు, బెట్టింగ్‌లకు దేశమంతటా పేరొందిన ఫలోదీ మార్కెట్ ఇప్పటికీ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని నమ్ముతోంది. అక్కడి పంటర్లు మోదీ సర్కారుపైనే బెట్టింగులు కడుతున్నారు. కానీ నెలక్రితం అంచనాలతో పోలిస్తే బీజేపీ నెగ్గబోయే స్థానాల సంఖ్య బాగా తగ్గడం విశేషం. బీజేపీ 330 నుంచి 333 స్థానాలు నెగ్గుతుందని తొలి విడత పోలింగ్‌కు ముందు దాకా ఇక్కడ జోరుగా పందేలు సాగాయి. కానీ ఇప్పుడది 296 నుంచి 300 సీట్లకు పరిమితమైంది...! క్రమంగా తగ్గుదల.. ఒక్కో విడత పోలింగ్ జరుగుతున్న కొద్దీ ఫలోదీ బజార్లో బీజేపీకి అంచనాలు తగ్గుతూ వస్తున్నాయి. 307 నుంచి 310 స్థానాలు గెలుస్తుందంటూ మే 13న నాలుగో విడత పోలింగ్‌కు ముందు పందేలు నడిచాయి. నాలుగో దశ ముగిశాక తాజాగా 296 నుంచి 300కు తగ్గాయి. ఎన్డీఏకు 350 దాటుతాయని తొలుత పేర్కొనగా, 329 నుంచి 332 మధ్య రావచ్చని తాజాగా పందేలు సాగుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. ఇక కాంగ్రెస్‌కు 41 నుంచి 43 సీట్ల కన్నా రావని నెల క్రితం అంచనా వేసిన ఫలోదీ పందెంరాయుళ్లు కాస్తా, 58 నుంచి 62 స్థానాలు గెలుస్తుందని తాజాగా బెట్లు కడుతున్నారు. 2019లో కాంగ్రెస్‌కు 52 స్థానాలొచ్చాయి. ఈసారి నాలుగు విడతల్లో పోలింగ్ 2019 ఎన్నికలతో పోలిస్తే కాస్త తగ్గడం తెలిసిందే. తదనుగుణంగా ఫలోదీ మార్కెట్ కూడా బీజేపీ విషయంలో అంచనాలను సవరించుకున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రాలవారీగా.. ఫలోదీ సట్టా బజార్ తాజా బెట్టింగ్‌ల ప్రకారం బీజేపీ గుజరాత్లో క్లీన్‌స్వీప్ చేస్తుంది. 26 స్థానాలూ గెలుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని 29కి 27–28 రావచ్చు. రాజస్తాన్‌లో 2019లో 24 గెలవగా ఈసారి 18–20తో సరిపెట్టుకోవచ్చు. ఒడిశాలోని మరో 4 స్థానాలు అదనంగా 11 నుంచి 12 రావచ్చు. పంజాబ్‌లో 2019లో రెండు గెలవగా ఈసారీ 2 నుంచి 3 రావచ్చు. మొత్తం 10 స్థానాలూ గెలిచిన హరియాణాలో 5 నుంచి 6తో సరిపెట్టుకోవచ్చు. తెలంగాణలో 4 గెలవగా ఈసారి 5 నుంచి 6 రావచ్చు. ఛత్తీస్‌గఢ్‌లోని 11, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4, ఉత్తరాఖండ్‌లోని 5 స్థానాలనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుంది. జార్ఖండ్‌లో మళ్లీ 10 నుంచి 11 దాకా రావచ్చు. 2019లో ఒక్క సీటూ నెగ్గని తమిళనాడులో 3 నుంచి 4 స్థానాలు రావచ్చని బెట్టింగులు నడుస్తున్నాయి. కీలకమైన పశి్చమబెంగాల్లో 2019లో 18 చోట్ల గెలవగా ఈసారి 21 నుంచి 22 దాకా రావచ్చు. యూపీలో 63 చోట్ల గెలిచిన బీజేపీ ఈసారి మరో రెండు సీట్లు పెంచుకోవచ్చని సట్టా బజార్ అంచనా. కచ్చితత్వం ఎక్కువ... ఎన్నికల ఫలితాల విషయంలో ఫలోదీ మార్కెట్ ఏం చెబితే అదే జరుగుతుందన్న నమ్మకముంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఫలోదీ బుకర్ల అంచనాలే అక్షరాలా నిజమయ్యాయి. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ విషయంలో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ తలకిందులు కాగా సట్టా బజార్ అంచనాలు మాత్రమే నిజమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
128 డిగ్రీల జ్వరం వచ్చింది!
ఫలోడి: మామూలుగా 102-103 డిగ్రీల జ్వరం వచ్చిందంటేనే భరించడం కష్టం. అలాంటిది ఏకంగా 128 డిగ్రీల జ్వరం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఔనండీ.. రాజస్థాన్ లోని ఫలోడి ప్రాంతానికి శుక్రవారం 128 ఫారెన్ హీట్ ఎండతో జ్వరం వచ్చినట్లయింది. దీన్ని సెంటీగ్రేడ్లోకి మారిస్తే.. 51 డిగ్రీలు అవుతుంది. ఇప్పటివరకు దేశంలో సంభవించిన అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డులను ఇది బద్దలుకొట్టింది. ఎండ దెబ్బతో విలవిలలాడిన రాజస్థాన్ వాసులు... తాగునీటి కోసం తహతహలాడారు. ఇక రోజువారీ కూలి చేసుకుని అరకొర వేతనంతో జీవించే వారయితే ఎండ బాగా ఉన్న సమయంలో అంటే మధ్యాహ్నం ఒకటి నుంచి నలుగున్నర గంటల వరకు విరామ సమయంగా ప్రకటించేశారు. వేసవిలో ఎప్పుడూ రికార్డుస్థాయిలో ఎండలు నమోదవుతాయి కానీ.. ఇంతపెద్ద మొత్తంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు వాపోయారు.