
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ వచ్చీ రాగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో తీవ్ర వడగాలులు వీయడంతో పాటు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి.. ఎన్నికల వేడి.. కరువు దాడి