పాక్ లో వడగాడ్పులు: 140 మంది మృతి
కరాచీ: భారత దేశాన్ని వర్షాలు ముంచెత్తుతుంటే.. మన పొరుగు దేశం పాకిస్తాన్ లో వడగాడ్పులు విజృంభిస్తున్నాయి. ఈ కారణంగా కరాచీలో ఇప్పటి వరకు 140 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. శనివారం నమోదైన ఉష్ణోగ్రతలను గమనిస్తే.. కరాచీ - 44.8 డిగ్రీలు, జకోబాబాద్, లర్కనా, సుక్కుర్ జిల్లాలో 48 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ ఏడాదిలోనే నమోదైన అత్యధికం ఉష్ణోగ్రత గణాంకాలు ఇవే.
ఆదివారం నాడు 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రానున్న రెండు రోజుల్లో ఎండలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు రంజాన్ మాసం కావడంతో పాకిస్తాన్లో చాలా మంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేసవిలో వడగాడ్పుల కారణంగా భారత్లో కూడా 1000 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.