
సాక్షి ముంబై: తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల దేశంలోని అన్ని ప్రాంతాలు ఉడికిపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. విదర్భ, మరాఠ్వాడాలో 20 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా వడగాడ్పులు వీస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. వీరిలో జల్‌గావ్ జిల్లాలోని రావేర్‌లోని నమ్రతా చౌదరి, అమల్‌నేర్‌లోని రూపాలి రాజ్‌పుత్ ఉండగా.. నాందేడ్ జిల్లాలోని విశాల్ మాదస్‌వార్ ఉన్నారు. ఈ ముగ్గురు వడదెబ్బతోనే మృతి చెందినట్లు సంబంధిత డాక్టర్లు తెలిపారు. ఈ వార్త భయాందోళనతోపాటు విషాదాన్ని నింపింది. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ..