సీజన్ ప్రకారం మార్చి ఒకటో తేదీ (శుక్రవారం) నుంచి వేసవి ప్రారంభమైంది. జూన్ ఒకటో తేదీ వరకు ఎండాకాలం కొనసాగనుంది. కానీ పదిరోజుల కింది నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో భానుడి ప్రతాపం ఎలా ఉంటుందో ఊహించుకునేందుకే భయమేస్తోంది. రానున్న రోజుల్లో రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.