వడదెబ్బకు 11 మంది బలి | 11 people dead with sunstroke on saturday | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు 11 మంది బలి

Published Sat, May 23 2015 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

11 people dead with sunstroke on saturday

ఎన్నాడూ లేనంతగా.. మూడు రోజులుగా భానుడు ప్రతాపాన్ని చూపుతుండడంతో ఎండ వేడిమిని తాళలేక జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలో సాధారణం కన్నా మూడు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గురువారం ఐదుగురు,శుక్రవారం ఆరుగురు మృతి చెందగా.. శనివారం 11 మంది మృత్యువాత పడ్డారు.
 
 తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన బ్యాగరి రాములు (58) వ్యక్తిగత పనుల నిమిత్తం ఊరిలోకి వెళ్లా డు. అయితే గ్రామస్తులతో మాట్లాడుతుండగానే కుప్పకూలి మృత్యువాతపడ్డాడు. మృతుడికి భార్య భూదవ్వ, కుమారులు మహేష్, చందు  ఉన్నారు. కల్హేర్ మండలం ఫత్తెపూర్ గ్రామానికి చెందిన జంగం కంఠప్ప (70) శుక్రవారం వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా.. అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఇంటికి రాగానే.. వాంతులు, విరేచనాలు చేసుకుంటుండడంతో కుటుంబ సభ్యులు కంఠప్పను రాత్రి స్థానిక ప్రైవే ట్ వైద్యుల వద్ద చికిత్స చేయించారు. రాత్రి పొద్దు పోయాక మృతి చెందాడు.

 చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన టప్ప లక్ష్మి (60) రెండు రోజుల క్రితం చేగుంటకు వచ్చింది. ఇక్కడ భిక్షాటన చేస్తూ మక్కరాజీపేట రోడ్డులో ఉండేది. శనివారం మధ్యాహ్నం మక్కరాజీపేట రోడ్డులోని ఓ సిమెంట్ గోదాం వద్ద అచేతనంగా పడి ఉన్న లక్ష్మిని స్థానికులు గుర్తించారు. దగ్గరకు వెళ్లి చూడగా.. లక్ష్మి మృతి చెంది ఉంది. బ్లూ కోట్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వడదెబ్బతో లక్ష్మి మృతి చెందినట్లు గుర్తించి విష యం పొలంపల్లికి సమాచారం అందించారు. దీంతో మృతురాలు కుమారుడు కిష్టయ్యతో పాటు బంధువులు చేగుంట కు చేరుకుని లక్ష్మి మృతదేహాన్ని గ్రామానికి తరలించారు.

 టేక్మాల్ మండం ఎలకుర్తి మదిర గ్రామమైన శేర్‌పల్లికి చెందిన దాసరి సాయిలు (40) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. గత నెల రోజులుగా మామిడి చెట్లను గుత్తకు తీసుకుని పండ్లను నిజామాబాద్‌కు తరలిస్తూ అక్కడ విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా అనారోగ్యానికి గురి కావడంతో ఇంటి వద్దనే ఉన్నాడు. శనివారం వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో పాటూ జ్వరం రావడంతో 108లో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్య లో మృతి చెందాడు.

 పుల్‌కల్ మండలం చౌటాకూర్ గ్రా మ పంచాయతీలో వాటర్‌సప్లయ్ కార్మికుడిగా పనిచేస్తున్న లక్ష్మయ్య (65) శనివారం మధ్యాహ్నం గ్రామంలోని వీధులకు నల్లాలకు నీటిని వదిలివచ్చిన అనంతరం ఇంటివద్దకు రాగానే సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లే లోపే మృతి చెందాడు.

అదేవిధంగా ఇదే మండలం కొర్పోల్ గ్రామానికి చెందిన గజువాడ రామకృష్టారెడ్డి(70) శుక్రవారం వ్యవసాయ పనులకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురై ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులు అతడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రామకృష్ణారెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన వెల్టూరి వీరేశం (19) వడదెబ్బతో మృతి చెందాడు.

 జహీరాబాద్ మండలం మొగుడంపల్లి గ్రామానికి చెందిన జెట్టమ్మ (45) శనివారం పొలం పనులకు వెళ్లింది. ఎండలో పని చేసిన ఆమె సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇంటికి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురి కాగా జెట్టమ్మను కుటుంబ సభ్యులు రాత్రి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

 తూప్రాన్ మండలంలోని కూచారంగ్రామానికి చెందిన డబీల్‌పూర్ మల్ల య్య (65) గురువారం మేడ్చల్ మండ లం అత్వేల్లిలో గల తన కుమార్తె వద్దకు వెళ్తి తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చాడు. అయితే అక్కడ ఎండలో తిరగడం వల్ల అస్వస్థతకు గురైన మల్లయ్య అలాగే పడుకున్నాడు. అయితే నిద్రలోనే మృతి చెందాడు. ఈ విషయాన్ని శనివారం ఉద యం కుటుంట సభ్యులు గుర్తించా రు.

 ములుగు మండలం దామరకుంట గ్రామానికి చెందిన బక్కల పెంటయ్య (65) ఎండల కారణంగా రెండు రోజు లుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించి ఇంటికి తీసుకువచ్చారు. అయితే శనివారం ఉదయం అతడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య పిల్లలున్నారు.

 జిన్నారం మండలం గుమ్మడిదల గ్రామానికి చెందిన చంద్రయ్యగౌడ్ (50) బొంతపల్లి పారిశ్రామిక వాడలోని ఆర్‌ఎంఎస్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా విధులను నిర్వహిస్తూ శనివారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. కాగా.. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని మృతుడి బంధువులు పరిశ్రమ ఎదుట రాత్రి 9 గంటల సమయంలో ఆందోళన చేపట్టారు. కాగా.. నష్టపరిహారాన్ని అందించేందుకు యాజ మాన్యం ముందుకు రాలేదని తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement