
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వచ్చే మూడురోజులు పాటు రెండు రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. విజయవాడలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. అలాగే నిజామాబాద్‌లో 42 డిగ్రీలు, రామగుండంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో జనం ఉక్కిబిక్కిరి అవుతున్నారు.