వడదెబ్బతో ఓ ప్రభుత్వ ఉద్యోగి బస్సులోనే మృత్యువాత పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోకు ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కాకినాడ అటవీశాఖలో పని చేస్తున్న మడి గంగరాజు ఇవాళ ఉదయం భార్యతో కలిసి కుమారుడి దగ్గరకు బయల్దేరారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో గంగరాజు మధ్యలోనే అస్వస్థతకు గురై... బస్సులోనే మృతి చెందారు. అప్పటివరకూ తనతో మాట్లాడిన భర్త విగతజీవిగా మారడంతో భార్య భోరున విలపించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
వడదెబ్బతో ప్రభుత్వ ఉద్యోగి మృతి
Published Sun, May 12 2019 1:51 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement