![These States Likely To See Highest Heat Wave This Year Details - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/2/temparature.jpg.webp?itok=HQOOclfw)
ఢిల్లీ: ఇప్పటికే భానుడి భగభగలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో భారతదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రత ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్ 'మృత్యుంజయ్ మహపాత్ర' ప్రకారం.. ఏప్రిల్-జూన్ కాలంలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భారతదేశంలో అధిక వేడి ఉంటుంది.
పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని మృత్యుంజయ్ మహపాత్ర చెప్పారు. అయితే మైదానాల్లోని చాలా ప్రాంతాలలో ఎక్కువ వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 20 రోజులపాటు వేడిగాలులు నమోదయ్యే అవకాశం ఉందని, ఆ సమయంలో వేడి మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని అన్నారు.
రాష్ట్రాల వారీగా గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మోహపాత్ర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment