న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ కు సుమారు 148 మంది ప్రయాణికులతో బయలుదేరిన టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో ఉన్నట్టుండి బాంబు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. క్యాబిన్లో బాంబును కనుగొన్న పైలట్.. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. ఆ సమయానికి దగ్గరలో ఉన్న న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అనుమతి తీసుకుని అత్యవసరంగా విమానాన్ని కిందకు దించారు.