Turkish Airlines
-
విమానంలో ఆరు సీట్లను బెడ్‌గా మార్చారు ఎందుకో తెలుసా!
ప్రపంచంలో అత్యంత పొడుగైనా మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న రుమేసా గెల్గి తొలిసారిగా ఫ్లైట్ జర్నీ చేసింది. ఆమె పొడుగే శాపంగా మారి ఎక్కడికి ప్రయాణించలేక ఇబ్బంది పడుతుండేది. ఐతే ఆమె బాధను టర్కిష్ ఎయిర్‌లైన్స్ దూరం చేసింది. ఆమె పొడగు కారణంగా విమానంలో కూర్చొని ప్రయాణించడం అసాధ్యం. అందుకని ఆమె కోసం ఆరు సీట్లను బెడ్‌గా మార్చి విమానంలో ప్రయాణించే ఏర్పాటు చేసింది. దీంతో ఆమె ఆనందానికి అవధులే లేకుండా పోయింది. గెల్గి ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో ఈ విషయాన్ని పంచుకుంది. ఈ మేరకు గెల్గి విమానంలో టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ప్రావిన్స్కోకు 13 గంటలు ప్రయాణించింది. ఇది తన చివరి ఫ్లైట్ జర్నీ మాత్రం కాదని నమ్మకంగా చెబుతోంది. తాను సాంకేతిక రంగంలో పనిచేస్తున్నానని, తనలాంటి వారికోసం మరిన్ని అవకాశాలను అన్వేషించేందుకు ఆరు నెలల పాటు యూఎస్‌లో ఉంటానని చెబుతోంది. విమానంలో ప్రయాణించే అవకాశం ఇచ్చినందుకు టర్కీష్ ఎయిర్ లైన్స్‌కి ధన్యావాదాలు చెప్పింది. భవిష్యత్తులో ఆమెకు మరింత సహాయ సహకారాలను అందజేస్తామని టర్కీ ఎయిర్‌లైన్స్ హామి ఇచ్చింది. View this post on Instagram A post shared by RUMEYSA GELGI (@rumeysagelgi) (చదవండి: ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న వెర్బల్ ఫాస్ట్! అసలు ఈ ఉపవాసం ఎందుకంటే..) -
ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య.. 32 మందికి గాయాలు
న్యూయార్క్: విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో 32 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఇస్తాంబుల్ నుంచి న్యూయార్క్ బయలుదేరిన టర్కీష్ ఎయిర్‌లైన్స్ విమానంలో శనివారం రోజున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విమానం మరో గంటలో న్యూయార్క్ జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందన్న సమయంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానంలో అల్లకల్లోల వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ప్రయాణికలతో పాటు, ఫ్లైట్ సిబ్బందికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అదృష్టావశాత్తు విమానం శనివారం సాయంత్రం 5.30 గంటలకు జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో క్షేమంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అధికార ప్రతినిధి స్టీవ్ కోల్మన్ మాట్లాడుతూ.. ‘ది బోయింగ్ 777 విమానం 326 ప్రయాణికులు, 21 మంది సిబ్బందితో ఇస్తాంబుల్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరింది. విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే 45 నిమిషాల మందు విమానంలో భయానక పరిస్థితి నెలకొంది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు ఆందోళకు గురయ్యారు. ఈ ఘటనలో మొత్తం 32 మంది గాయపడగా.. వారిలో కొందరిని అధికారులు చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన వల్ల ఇతర విమానాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేద’ని తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఓ వ్యక్తి కాలు విరిగినట్టు సమాచారం. గాయపడినవారిలో ఓ చిన్నారి కూడా ఉన్నారు. -
విమానంలో ప్రత్యేక అతిథి.. సర్ప్రైజ్ ఇచ్చిన పైలెట్
జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే.. ఆ జన్మకు సార్ధకత లభించేలా చేసేది గురువులు. ఉపాధ్యాయుల గొప్పదనం తెలిపే ఓ సూక్తి ఇలా చెప్తుంది.. ‘నా ముందు దైవం, గురువు ఇద్దరూ నిలబడితే.. నేను ముందుగా గురువుకు నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఈ రోజు నాకు భగవంతుని దర్శనం లభించిందంటే అందుకు కారణం గురువు’ అని ఉంటుంది. అది ఉపాధ్యాయులకు మనం ఇవ్వాల్సిన గౌరవం. తాము విద్యాబుద్ధులు నేర్పిన వారు నేడు ప్రయోజకులై తమ కళ్లముందుకు వస్తే వారికి కలిగే సంతోషం మాటల్లో వర్ణించలేము. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఓ ఉపాధ్యాయునికి. తన విద్యార్థి ఇచ్చిన సర్ఫ్రైజ్.. ఆ టీచర్నే కాక ఇతర ప్రయాణికుల చేత కూడా కంటతడి పెట్టించింది. వివరాలు..టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో ఓ వృద్ధుడు ప్రయాణిస్తున్నారు. విశేషం ఏంటంటే చిన్నప్పుడు అతని వద్ద చదువుకున్న విద్యార్థే ఆ ఎయిర్‌లైన్స్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు చదువు చెప్పిన టీచర్, నేడు తాను నడుపుతున్న విమానంలోనే ప్రయాణిస్తుండటంతో ఆ పైలెట్ తెగ సంతోషపడ్డాడు. తన టీచర్‌కి జీవితాంతం గుర్తుడిపోయేలా ఏదైనా సర్ఫ్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. వెంటనే.. ‘విమానంలో ఎడమ వైపు నల్లకోటు వేసుకున్న వ్యక్తి నా స్కూల్ టీచర్. ఒకప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ ఈరోజు నేను నడిపే విమానంలో ప్రయాణిస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను. ఈ సందర్భంగా ఆయనకు గుర్తుండిపోయేలా ఏదన్నా చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆయనకు పువ్వులు ఇచ్చి విష్ చేయాల్సిందిగా సిబ్బందిని కోరుతున్నాను’ అంటూ ఉద్వేగానికి లోనవుతూ ప్రకటన చేశాడు. ఈ ప్రకటన విన్న ఆ టీచర్‌కి కన్నీళ్లాగలేదు. ఈ లోపు పైలట్ చెప్పినట్లుగానే విమానంలోని ఇతర సిబ్బంది ఫ్లవర్ బోకేలు ఇచ్చి సదరు టీచర్ని విష్ చేశారు. ఆ తర్వాత తన టీచర్‌ను కలవడానికి క్యాబిన్ నుంచి పైలట్ కూడా వచ్చాడు. టీచర్ని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. సదరు పైలట్ చేసిన పనికి తోటి ప్రయాణికులకు కూడా కన్నీరాగలేదు. చప్పట్లు కొడుతూ పైలట్‌ను అభినందించారు. విమానంలోని కొందరు ప్రయాణికులు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. అయితే ఇదే సమయంలో విమానంలో టర్కీకి చెందిన ఇష్టిషమ్ ఉల్హక్ అనే విలేకరి కూడా ఉన్నారు. Turkish Airlines pilot thanks his school teacher who was on board the flight. Very moving and shows the ultimate respect to the educators who shape our lives. pic.twitter.com/loEvkLQh3m — Ihtisham ul Haq (@iihtishamm) November 28, 2018 ఈ వీడియోను ఆయన ట్విటర్లో పోస్ట్ చేస్తూ..‘ తనకు చదువు చెప్పిన టీచర్ తను నడుపుతున్న విమానంలో ఉన్నారని తెలిసి ఈ పైలట్ ఈ రకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ దృశ్యం నన్నెంతో కదిలించింది. మన జీవితాలకు వెలుగునిచ్చిన ఉపాధ్యాయులకు మనం ఇచ్చే మర్యాద ఇది..’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో చాలా వైరల్ అవుతోంది. -
విదేశీయులకు అమెరికా ఉపశమనం
న్యూఢిల్లీ: విమానమార్గంలో తమ దేశానికి వచ్చే విదేశీయులకు అమెరికా కాస్తంత ఉపశమనం కల్పించింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో అమెరికాకు వచ్చే విదేశీయులు తమ ల్యాప్‌టాప్స్‌ను వెంట తెచ్చేకునేందుకు అమెరికా అనుమతినిచ్చింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే తమ విమానాల్లో ల్యాప్‌టాప్‌లను అనుమతిస్తారని ఎమిరేట్స్ సంస్థ బుధవారం ప్రకటించింది. ఇస్తాంబుల్‌లోని ఆటాటర్క్ విమానాశ్రయం నుంచి అమెరికాకు వెళ్లే తమ విమానాల్లో ప్రయాణికులు తమ ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ స్పష్టంచేసింది. ఉగ్రవాద దాడుల భయంతో ఎనిమిది ముస్లిం దేశాల నుంచి వచ్చే విమానాల్లో వచ్చే ప్రయాణికులపై మార్చి నెలలో అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కెమెరాలు, ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను విమానం క్యాబిన్ బ్యాగుల్లో పెట్టి తీసుకురాకుండా ఆంక్షలు పెట్టింది. ఈ నిబంధనల ప్రభావం ఈజిప్ట్ ఎయిర్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, ఎతిహాద్ ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్, ఖతార్ ఎయిర్వేస్, రాయల్ ఎయిర్ మొరాక్, రాయల్ జోర్డానియన్ ఎయిర్‌లైన్స్, సౌదీఅరేబియన్ ఎయిర్‌లైన్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌పై పడింది. తాజాగా నిబంధనలను సడలించిడంతో ఎమిరేట్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు ఉపశమనం కలిగింది. -
విమానంలో అనుకోని అతిథికి స్వాగతం
అనుకోని అతిథికి టర్కిష్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది స్వాగతం పలికారు. ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆదివారం టర్కిష్ ఎయిర్‌లైన్ విమానంలో చోటుచేసుకుంది. 28 వారాల గర్భణి అయిన నఫీ డైబీ గినియా రాజధాని కొనాక్రీకి వెళుతోంది. వాస్తవానికి ఆ బిడ్డ తల్లి మరో రెండు నెలల తర్వాత ప్రసవించాల్సి ఉంది. అయితే విమానంలో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా పురిటి నొప్పులు రావడంతో తోటి ప్రయాణికులతో పాటు, విమాన సిబ్బంది సాయపడి పురుడు పోశారు. విమానంలో పాప పుట్టిన విషయాన్ని తెలియజేయడం తమకెంతో గర్వంగా ఉందని టర్కిష్ ఎయిర్వేస్ పోస్ట్ చేసింది. అలాగే పురిటి నొప్పులతో బాధపడుతున్న ప్రయాణికురాలు సాయం అందించేందుకు సత్వరమే స్పందించిన తమ విమాన సిబ్బందిని ప్రశంసించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారంటూ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఆ బుజ్జాయికి కదిజు అని పేరు కూడా పెట్టేశారు. అప్పుడే పుట్టిన ఆ పాపతో కలిసి విమాన సిబ్బంది ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ప్రయాణికురాలితో పాటు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విమాన సిబ్బందికి ట్విట్టర్లో అభినందనలు వెల్లువెత్తాయి. టర్కిష్ విమాన సిబ్బంది మానవతా దృక్పధంతో ప్రవర్తించారని వ్యాఖ్యానించారు. ఆకాశంలో పుట్టిన ఆ చిన్నారికి బర్త్ ప్లేస్ ఏమవుతుందని ఒకరంటే, మరొకరు ఆమె ఖచ్చితంగా పైలట్ అవుతుందంటూ జోస్యం చెప్పారు. Welcome on board Princess! Applause goes to our cabin crew! -
విమానం కేబిన్‌లో బాంబు బెదిరింపు