బేబీ డైపర్లలో బంగారం బిస్కెట్లు | Delhi: Gold biscuits weighing 16 kgs recovered from baby diapers at IGIA | Sakshi
Sakshi News home page

బేబీ డైపర్లలో బంగారం బిస్కెట్లు

Published Mon, Dec 12 2016 1:15 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

బేబీ డైపర్లలో బంగారం బిస్కెట్లు

బేబీ డైపర్లలో బంగారం బిస్కెట్లు

న్యూఢిల్లీ:  అక్రమార్కులు  చివరికి బేబీ డైపర్లు ను కూడా వదలడం లేదు.  తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో బేబీ డైపర్లలో దాచి అక్రమంగా రవాణా చేస్తున్న 16 కిలోల  బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
 
ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో  దుబాయ్ నుంచి  వస్తున్న ప్రయాణీకులనుంచి 16 కిలోల బంగారం బిస్కెట్లను అధికారులు కనుగొన్నారు.  ఆరుగురు ప్రయాణికులతో కూడిన బృందం దుబాయ్ నుంచి ఇక్కడకు చేరుకున్నారు. తమతో పాటు తీసుకొస్తున్న ఇద్దరు  పిల్లల డైపర్లలో ఈ బిస్కట్లను చాలా తెలివిగా దాచి పెట్టారు. అయితే తనిఖీల్లో అధికారులు చాకచక్యంగా వాటిని పట్టుకొన్నారు.  

కిలో బరువున్న పదహారు బంగారు బిస్కెట్లను రెండు గ్రూపుల నుంచి  స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్  అధికారులు తెలిపారు.  వీరిలో సూరత్ కు చెందిన దంపతులు కూడా ఉన్నారన్నారు.  విచారణ కొనసాగుతోందని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement