అమెజాన్‌లో సీబీడీ ఆయిల్: మీరా చోప్రా | Actor Meera Chopra Says She Found CBD oil Being Sold Online | Sakshi
Sakshi News home page

నిషేధించినప్పుడు ఎలా లభిస్తుంది: మీరా చోప్రా

Sep 24 2020 9:59 AM | Updated on Sep 24 2020 10:14 AM

Actor Meera Chopra Says She Found CBD oil Being Sold Online - Sakshi

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసుతో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్‌ హీరోయిన్‌లు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు సంచలన వార్తలు వెలుగు చూస్తున్నాయి. వీరిలో కొందరు సీబీడీ ఆయిల్ ‌(కానబిడియోల్‌ ఆయిల్‌) వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నటి మీరా చోప్రా చేసిన ఓ ట్వీట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సీబీడీ ఆయిల్‌ కోసం ఆన్‌లైన్‌లో సర్చ్‌ చేశానని.. ఇది అమెజాన్‌లో దొరుకుతుందని తెలిపారు. ఈ మేరకు ఆమెకు ట్వీట్‌ చేశారు. ‘ఊరికే అడుగుతున్నాను. సీబీడీ ఆయిల్‌ని భారత్‌లో నిషేధించినప్పుడు అది ఆన్‌లైన్‌లో ఎలా అందుబాటులో ఉంది. ఇది అమెజాన్‌లో లభిస్తుంది. నేను చూశాను. నిషేధించినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు’ అంటూ మీరా చోప్రా ప్రశ్నించింది. ఇక సీబీడీ ఆయిల్‌ గంజాయి నుంచి లభిస్తుంది. దీన్ని మన దేశంలో నిషేధించారు. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా సంచలన విషయాలను వెల్లడించింది. (చదవండి: సుశాంత్‌ డ్రగ్స్‌ కోసం మమ్మల్ని వాడుకున్నాడు)

సుశాంత్, రియా చక్రవర్తితో పాటు తన కోసం కూడా సీబీడీ ఆయిల్‌ను ఆర్డర్ చేసినట్లు జయ సాహా అంగీకరించిందని సమాచారం. అలాగే రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా సుశాంత్‌కు ఇచ్చే డ్రగ్‌ను ఎలా వినియోగించాలో చెప్పిందని సమాచారం. సీబీడి ఆయిల్‌ని సుశాంత్ తాగే టీలో నాలుగైదు చుక్కలు కలిపి ఇవ్వాలని, అలా అరగంటకోసారి ఇవ్వాలని రియా చక్రవర్తికి సూచించానని జయ సాహా తెలిపినట్లుగా సమాచారం. ఇక రియా లాయర్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో సీబీడి గురించి మాట్లాడారు. దీనిలో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని బాటిల్‌ మీద ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక రియా తన బెయిల్‌ పిటిషన్‌లో సుశాంత్‌కి మాదక ద్రవ్యాల అలవాటు ఉందని.. అతని కోసం తాను అప్పుడప్పుడు చిన్న చిన్న పరిమాణంలో డ్రగ్స్‌ తీసుకున్నానని తెలిపింది. అయితే తాను డ్రగ్‌ సిండికేట్‌లో భాగం కానని రియా వెల్లడించింది. బాంబే హై కోర్టు ఈ రోజు ఆమె బెయిల్‌ పిటిషన్‌ని విచారించనుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement