కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్‌తో సెల్ఫీ దిగిన ప్రైవేట్ డిటెక్టీవ్
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడని ఎన్‌సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మేజిస్ట్రేట్ కోర్టు అతడితోపాటు మరో ఇద్దరికి ఈ నెల 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన ఓ ఫోటో తెగ వైరలవ్వడంతో పాటు వివాదాస్పదంగా కూడా మారింది.
పోలీసుల కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్‌తో ఓ వ్యక్తి సెల్ఫీ దిగాడు. సదరు వ్యక్తిని ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా గుర్తించారు. ఇక ఈ ఫోటోపై మహారాష్ట్ర మినిస్టర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు ప్రైవేటు వ్యక్తిని ఎలా అనుమతించారంటూ ప్రశ్నించారు.
(చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం, ఎవరీ మున్‌మున్ ధమేచ)
ఎన్‌సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ ఈ ఆరోపణలు చేశారు. ఈ సందరన్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం ఆర్యన్ ఖాన్ చేయి పట్టుకుని.. ఎన్‌సీబీ కార్యాలయానికి తీసుకుని వచ్చి వ్యక్తి ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావి. అలానే బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మనీశ్ భానుశాలి రెయిడ్ జరిగిన విజువల్స్‌లో కనిపించారు. ఎన్‌సీబీ అధికారులతో పాటు ఉన్న వీరిద్దరని చూస్తే.. దీనిలో బీజేపీ హస్తం ఉందని అర్థం అవుతుంది. నకిలీ డ్రగ్స్ రాకెట్‌ను పట్టుకుని.. మహారాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది’’ అన్నారు.
నవాబ్ మాలిక్ వ్యాఖ్యలను ఎన్‌సీబీ కొట్టిపారేసింది. ఈ ఇద్దరినీ "స్వతంత్ర సాక్షులు" అని పేర్కొంది. ‘‘నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ కేసుకు సంబంధించిన విచారణ చట్టపరంగా, వృత్తిపరంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనసాగుతోంది" అని ఎన్‌సీబీ అధికారి జ్ఞానేశ్వర్ సింగ్ అన్నారు. ఆర్యన్ ఖాన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్‌తో పాటు మరో ఆరుగురిని సోమవారం అరెస్టు చేశారు.
(చదవండి: Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..?)
భానుశాలి పాత్రపై బీజేపీ స్పందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలి. "రాజకీయాలు చేయడానికి అనేక సమస్యలు ఉంటాయి, కానీ మన దేశ భవిష్యత్తు తరాలకు సంబంధించిన డ్రగ్స్ విషయంలో మేము రాజకీయాలు చేయలేం’’ అని బీజేపీ ప్రతినిధి రామ్ కదం స్పష్టం చేశారు
క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీపై గత శనివారం రాత్రి దాడులు చేసిన తరువాత, డ్రగ్స్ నిరోధక అధికారులు 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరాస్, 22 ఎక్స్టసీ మాత్రలు, 33 1.33 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ పట్టుబడలేదు. అయితే, అతని వాట్సాప్ చాట్‌లో నేరపూరితమైన విషయాలు ఉన్నట్లు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది.
చదవండి: మీ టీనేజర్ పార్టీలో ఉంటున్నాడా? కనిపెట్టండి.. కాపాడుకోండి..!
Comments
Please login to add a commentAdd a comment