ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ 2019లో నిర్వహించిన డ్రగ్ పార్టీపై విచారణ జరపాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కి ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఫిర్యాదు చేశారు. దీంతో కరన్‌తో పాటు అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. డ్రగ్ పార్టీ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించామని, ఆ వీడియో నిజమని తేలితే, విచారణ చేపట్టనున్నట్లు ఎన్‌సీబీ తెలిపింది.
2019, ఆగస్టు 1న ఈ డ్రగ్ పార్టీపై ఫిర్యాదు చేశానని, అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ముంబై పోలీసులు ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకొని ఉంటే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని రక్షించుకోగలిగేవారమని శిరోమణి అకాలీదళ్ నాయకులు సిర్సా తెలిపారు. ఆ రోజు జరిగిన డ్రగ్స్ పార్టీలో దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, జోయా అక్తర్ లాంటి ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ చలన చిత్ర పరిశ్రమలో కరణ్ ఆశ్రిత పక్షపాతానికి పాల్పడతారని, ఆయనపై అనేక మార్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment