
బాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసుకు, నిర్మాత కరణ్ జోహార్ 2019లో నిర్వహించిన పార్టీకి సంబంధాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ పార్టీలో స్టార్ నటులు దీపికా పదుకొణె, షాహిదోద్ కపూర్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, జోయా అక్తర్ లాంటి ప్రముఖులు పాల్గొనగా.. వీరు డ్రగ్స్ స్వీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు వాళ్లు ఏదో మైకంలో ఉన్న వీడియో కూడా ఇటీవల తెగ వైరల్ అయింది. (చదవండి: డ్రగ్స్ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!)
ఈ క్రమంలో సుశాంత్ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణంపై విచారణ చేపడుతోన్న ఎన్‌సీబీ తాజాగా ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అది అవాస్తవమని ఎన్‌సీబీ ఖండించింది. ప్రస్తుత కేసుకు, కరణ్ నివాసంలో జరిగిన పార్టీ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్త అశోక్ జైన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో గురించి ఎలాంటి వివరాలు సేకరించడం లేదని తెలిపారు. కాగా కరణ్ సైతం తన పార్టీలో డ్రగ్స్ వాడకం జరగలేదని పేర్కొన్న విషయం తెలిసిందే.. (చదవండి: నాకు డ్రగ్స్ అలవాటు లేదు)
Comments
Please login to add a commentAdd a comment