Bollywood Drugs Case: విచారణకు హాజరైన రకుల్‌ | Rakul Preet Singh Arrives at NCB Officie to be Questined - Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసు: విచారణకు హాజరైన రకుల్‌

Published Fri, Sep 25 2020 11:00 AM | Last Updated on Fri, Sep 25 2020 1:56 PM

Actor Rakul Preet Singh Attend At NCB In Drugs Case - Sakshi

ముంబై : బాలీవుడ్‌–డ్రగ్స్‌ సంబంధాలపై విచారణలో భాగంగా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను శుక్రవారంకు హాజరైంది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) రెండు రోజుల క్రితం విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఎన్‌సీబీ పిలుపుమేరకు గురువారమే గోవా నుంచి ముంబై చేరుకుని శుక్రవారం ఉదయం ఎన్‌సీబీ ముందు హాజరైంది. డ్రగ్స్‌ వాడకంపై రకుల్‌ను ఎన్‌సీబీ ప్రశ్నించనుంది. బుధవారం దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లకు తదితరులకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. నేడు రకుల్‌ విచారణ అనంతరం శనివారం దీపికను ప్రశ్నించనున్నారు. అయితే శుక్రవారం విచారణలో భాగంగా దీపిక మేనేజర్‌ కూడా ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంలో విచారణ చేపట్టిన ఎన్‌సీబీ..బాలీవుడ్‌–డ్రగ్స్‌ సంబంధాలపై దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు మరికొంతమందిని కస్టడీలో తీసుకుని విచారిస్తోంది. (రేపు దీపికా, సారా, శ్రద్ధా వంతు..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement