సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న నటి రియా చక్రవర్తికి హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని మత్తు పదార్థాల నియంత్రణా సంస్థ (ఎన్‌సీబీ) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో సీజేఐ బోబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం ఈ కేసును మార్చి 18న విచారించనుంది.
రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు గతేడాది అక్టోబర్ 7న బెయిల్ ఇచ్చింది. రూ. లక్ష పూచీకత్తుగా ఇవ్వాలని, పాస్‌పోర్టు అధికారులకు సమర్పించాలని, ముంబై దాటి వెళ్లాల్సి వస్తే ఎన్‌సీబీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందిగా పలు నిబంధనలు పెట్టింది. రానున్న ఆరు నెలల పాటు ప్రతినెల 1న పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందిగా కూడా ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు మీదే ఎన్సీబీ సుప్రీంకోర్టును చేరింది. ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ దొరకలేదు.
Comments
Please login to add a commentAdd a comment