మహారాష్ట్ర:ముంబైలో పట్టుబడుతున్న భారీ డ్రగ్స్ స్థావరాలు హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) గుర్తించింది. శుక్రవారం ముంబై నార్త్ అంధేరీలో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ 4.6కిలోల ఎపిడ్రిన్ డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో తయారు చేసి పరుపులు, మెత్తల్లో పెట్టి సముద్ర మార్గంగా ఆస్ట్రేలియా తరలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబై మీదుగా ఆస్ట్రేలియా డ్రగ్స్ తరలింపు జరుగుతోంది.
చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యోగిత అరెస్టు.. కీలక విషయాలు వెల్లడి
మూడు రోజుల క్రితం గోవా డ్రగ్స్ కేసులో హైదరాబాది సిద్ధిక్ అహ్మద్ అరెస్టు అయ్యారు. శనివారం ముంబైలో షిప్‌లో పట్టుబడ్డ ఎపిడ్రిన్ సైతం హైదరాబాద్ నుండే వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎపిడ్రిన్ డ్రగ్స్‌కు హైదరాబాద్ కేంద్రంగా మారినట్లు సమాచారం. నైజీరియన్ పెడ్లర్లుగా మార్చుకుని పెద్ద ఎత్తున డ్రగ్స్ బిజినెస్ జరుగుతోంది. ఇటీవల బెంగళూర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్ డాన్ యోగిత, హైదరాబాద్‌లోనూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి.
యోగిత, సిద్ధిఖ్ అహ్మద్‌ల విచారణలో హైదరాబాద్ డ్రగ్స్ లింకులు బయటపడనున్నట్లు తెలుస్తోంది. ముంబై తీరంలో శనివారం క్రూజ్ షిప్‌లో రేవ్ పార్టీపై అధికారులు దాడి చేయగా.. రేవ్ పార్టీలో షారుఖ్ పెద్ద కొడుకు అర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment