నువ్వేనా? నీ తల్లి కూడా ఇంతేనా? నటిపై విరుచుకుపడ్డ అత్త | Ranjana: We Didn't Want Vicky Jain To Marry Ankita Lokhande | Sakshi
Sakshi News home page

Ankita Lokhande: అందుకే నా కోడలు మాజీ ప్రియుడిని కలవరిస్తోంది: నటి అత్త

Published Wed, Jan 10 2024 5:14 PM | Last Updated on Wed, Jan 10 2024 5:52 PM

Ranjana: We Did not Want Vicky Jain to marry Ankita Lokhande - Sakshi

బిగ్‌బాస్‌లో కొట్లాటలు సహజం. పెళ్లైన జంటల్ని తీసుకొచ్చి మరీ వాళ్ల మధ్య చిచ్చు పెడుతుంటాడు బిగ్‌బాస్‌. అయితే భార్యాభర్తలు గొడవపడటం, తిరిగి కలిసిపోవడం సర్వసాధారణం. ఈ పోట్లాటలు చాలానే చూశాం. కానీ కనీవినీ ఎరగని రీతిలో లోపల భార్యాభర్తలు ఫైటింగ్‌లు చేస్తుంటే బయట వారి తల్లులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఒకరినొకరు నిందించుకుంటున్నారు. దీనికి గల కారణమేంటి? అసలేమైంది? అనేది తెలియాలంటే ఇది చదివేయండి..

ఒకరిని మించి మరొకరు
హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లో బుల్లితెర జంట అంకిత లోఖండే- విక్కీ జైన్‌ పాల్గొంది. చుట్టూ కెమెరాలున్నా సరే ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి ఇద్దరూ పోట్లాడుతూనే ఉంటారు. అందరిముందే భర్తను చులకన చేసి మాట్లాడటమే కాక ఒకానొక సమయంలో అతడిని తన్నిందా ఇల్లాలు. అతగాడేమీ తక్కువ కాదన్నట్లు భార్య ముందే మరో అమ్మాయి చేయి పట్టుకుని మాట్లాడిందే కాక అర్ధాంగి మీదకే చేయెత్తాడు. వీళ్లు చేసే రచ్చకు ఇది సాంపుల్‌ మాత్రమే! అంకిత అయితే పదేపదే తన మాజీ ప్రియుడు, దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం మాట్లాడుతూనే ఉంది.

ఇదేనా నీ సంస్కారం?
ఇది విక్కీ జైన్‌ తల్లి రంజనాకు మింగుడుపడలేదు. ఇంకేముంది.. ఇంటర్వ్యూలలో కోడలి తీరును ఉతికారేసింది. సింపతీ కోసమే నా కోడలు తన మాజీ ప్రియుడైన సుశాంత్‌ను తలుచుకుంటోంది. అతడు బతికి ఉన్నప్పుడు ఎంతో ప్రేమను పొందాడు. ఎన్నో గొప్ప పనులు చేశాడు. ఇప్పుడతడు లేడు. మరి తన గురించి తలుచుకుని ఏం లాభం? అంకిత నా కొడుకును కాలితో తన్నడం చూసి తట్టుకోలేకపోయాం. మన దేశంలో భర్తను దేవుడిగా చూస్తారు. కానీ నువ్వు నీ భర్తను ఎలా చూస్తున్నావు? ఇదేనా సంస్కారం? అని తిట్టిపోసింది. మరో ఇంటర్వ్యూలో అంకితను తన ఇంటి కోడలిగా తెచ్చుకోవడమే ఇష్టం లేదని చెప్పింది. కానీ కుమారుడి ఇష్టాన్ని కాదనలేక మౌనంగా ఉన్నామని చెప్పింది.

నీ తల్లి కూడా ఇంతేనా?
అయితే భార్యాభర్తలన్నాక లక్ష గొడవలుంటాయి. ప్రతిదాంట్లో మనం దూరనవసరం లేదు. వారి సరదా చేష్టలను సీరియస్‌గా తీసుకోనవసరం లేదు అని గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది అంకిత తల్లి వందన. ఎనిమిదేళ్లపాటు సుశాంత్‌తో కలిసి ప్రయాణించింది. బ్రేకప్‌ చెప్పుకున్నాక కూడా అతడి మంచే కోరుకుంది. అతడి గురించి ఆలోచిస్తే సింపతీనా? అని ఆగ్రహించింది వందన. ఇకపోతే ఫ్యామిలీ వీక్‌లో భాగంగా మంగళవారం నాడు అంకిత తల్లి, విక్కీ తల్లి ఇద్దరూ హౌస్‌లో అడుగుపెట్టారు. విక్కీని తన్నినందుకు అంకితకు ఆమె అత్త మొట్టికాయలు వేసింది. 'నీ ప్రవర్తన చూశాక నా భర్తకు ఎంత కోపమొచ్చిందో తెలుసా? ఆవేశంతో నీ తల్లికి ఫోన్‌ చేసి నువ్వు కూడా ఇలాగే నీ భర్తను తంతావా? నీ కూతురికి అదే నేర్పించావా? అని అడిగాడు' అని చెప్పింది.

ఇకనైనా గొడవలు తగ్గించేస్తారా?
ఈ మాటలు విని అంకిత బాధపడింది. ఈ మధ్యే నాన్న చనిపోయాడని, అలాంటప్పుడు ఈ గొడవలోకి మా అమ్మను ఎందుకు లాగుతున్నారంటూ ఏడ్చేసింది. అనంతరం అంకిత తల్లి బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టింది. కూతురు-అల్లుడును దగ్గరకు తీసుకున్న ఆమె ఇద్దరూ గొడవలు తగ్గించుకుని ఆప్యాయంగా ఉండమని సలహా ఇచ్చింది. మరోవైపు సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా.. అంకితాకు మద్దతుగా నిలబడటం విశేషం. మరి ఇకనుంచైనా అంకిత- విక్కీ పోట్లాటలు ఆపేస్తారా? లేదా అలాగే మొండిగా వ్యవహరిస్తారా? అనేది చూడాలి!

చదవండి: ఎంతోమందికి లైఫ్‌ ఇచ్చిన హీరో విజయ్‌కాంత్‌.. ఆయన కుమారుడి కోసం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement