
బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే అతని మరణంపై ప్రియురాలైన రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడిని అరెస్టు చేసింది. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన రియా.. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చిన రియా.. తన కెరీర్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు కూడా హాజరైంది. సుశాంత్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
(ఇది చదవండి: ముంబయిలో ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించా: స్టార్ హీరోయిన్)
రియా మాట్లాడుతూ.. 'సుశాంత్ మానసిక ఆరోగ్య సమస్యల గురించి తనకు బాగా తెలుసు. తను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నాకు తెలుసు. సుశాంత్ జీవితంలోకి తాను వచ్చినప్పటి నుంచి లైఫ్ మారిపోయింది. అతను అంతకుముందే బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి బాలీవుడ్‌లో పెద్ద స్టార్‌గా ఎదిగాడు. అందువల్ల అతన్ని నియంత్రించే మనస్సు కాదని చెప్పుకొచ్చింది. సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేశారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో.. ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదని చెప్పింది. ముంబైలోని బాంద్రా నివాసంలో 2020 జూన్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment