
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి ముంబై స్పెషల్ కోర్టులో ఊరట లభించింది. సుమారు 14 నెలల నుంచి సీజ్‌లో ఉన్న ఆమె బ్యాంక్ ఖాతాలను తిరిగి ఉపయోగించుకోవడానికి న్యాయస్థానం ఆమోదం తెలిపింది. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న రియా గతేడాది సెప్టెంబర్‌లో అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్‌సీబీ అధికారులు ఆమె బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అంతేగాక ఆమె ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను కూడా ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసిన నటి రియా చక్రవర్తి
ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన రియా.. తన బ్యాంక్ ఖాతాలను తిరిగి తన విడుదల చేయాలని స్పెషల్ కోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలే చేస్తూ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ నిమిత్తం తన బ్యాంక్ ఖాతాలను వెంటనే విడుదల చేయాలని పటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. వాదోపవాదాలు విన్న తర్వాత.. రియా బ్యాంక్ ఖాతాలను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. అంతేకాకుండా ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ని సైతం తిరిగి ఆమెకే ఇచ్చేయమని తీర్పులో పేర్కొంది. విచారణ పూర్తి అయ్యే వరకూ సెల్, ల్యాప్‌టాప్‌లను విక్రయించవద్దని కోర్టు రియాను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment