
కరోనా సమయంలో లాక్‌డౌన్ నుంచి ఇప్పటివరకూ ఎంతోమందికి అపన్నహస్తం అందించి రియల్ హీరోగా సమాజానికి స్ఫూర్తినిచ్చారు నటుడు సోనూసూద్. పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సోషల్‌మీడియా వేదికగా అందుబాటులో ఉంటూ తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు. దీంతో ఆయనను అభిమానించే వారిలో ఎక్కువగా యూత్‌నే ఉంటారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)
ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్ట్ 'MTV రోడీస్ సీజన్ 19' షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదే ప్రాజెక్ట్‌లో నటి రియా చక్రవర్తి కూడా ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతోంది. అక్కడ సెట్‌లో ఉన్న వారి కోసం సోనూసూద్ దోశెలు వేశారు. ఎవరికి ఎలాంటి దోశె కావాలో అడిగి మరీ సోనూ వడ్డించారు. ఇదే సమయంలో నటి రియా చక్రవర్తి కూడా అక్కడికి రాగా... 'మీకు ఎలాంటి దోశె కావాలి' అని అడిగి ఆమె కోరుకున్నట్లు టిఫిన్ సిద్ధం చేసి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన ఆయన అభిమానులు... 'మీరు అంటే మాకు ఎంతో గౌరవం.. అది ఎప్పటికీ కొనసాగుతుంది.. ఈ చర్యతో మీపై మరెంతో గౌరవం పెరుగుతుంది' అని కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..)
కానీ.. ఈ వీడియో చూసిన బాలీవుడ్ యువ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు మాత్రం కొంతమేరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రియా చక్రవర్తికి దూరంగా ఉండాలని ఇలా సోనూను కోరారు. 'మీరు ఆమెకు దోశెలు చేసి పెట్టడం మాకు ఏ మాత్రం నచ్చలేదు' అంటూ... తమ అసహనాన్ని కామెంట్ల రూపంలో తెలియచేశారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని కోంతకాలం పాటు రియా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వారు సోనూసూద్‌కు ఈ సలహా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment