ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటంతో నిర్భయంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమ కెరియర్‌లో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మీడియాతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను జాతీయ మీడియాతో పంచుకుంది.
‘నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను. హిందీలో పవిత్ర రిస్తా సీరియల్ ద్వారా నేను ప్రేక్షకాదరణను పొందిన తర్వాత నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఒక స్టార్ హీరో నన్ను గదిలోకి పిలిచి కంప్రమైజ్ అవుతావా అని అడిగాడు. ఆయన ప్రశ్నకు నేను తెలివిగా సమాధానం ఇచ్చాను. మీ నిర్మాతకు ఎలాంటి కంప్రమైజ్ కావాలట? నేనేమైనా పార్టీలకు, డిన్నర్లకు రావాలా అని ప్రశ్నించాను. దీంతో ఆ హీరో ఏమి మాట్లాడలేదు. అతనికి ఒక షేక్‌హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చాను. ఆ సినిమా చాన్స్ ఇక నాకు రాదని అప్పుడే అర్థమైంది. ’అని అకింతా లోఖండే చెప్పుకొచ్చింది. అయితే ఆ స్టార్ హీరో పేరుకాని, నిర్మాత పేరును కానీ అకింతా వెల్లడించలేదు. ఇక అంకితా లోఖండే కెరీర్ విషయానికొస్తే.. ఆమె నటిగా కంటే సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలిగానే ఎక్కువ గుర్తింపుపొందింది. బాలీవుడ్‌లో మణికర్ణిక, భాగీ3 చిత్రాల్లో నటించింది.
చదవండి:
‘ఏం అర్హత ఉందని నీకు ఇంత అందమైన భార్య?’
హీరోయిన్‌పై పిడిగుద్దులు కురిపించిన నితిన్!
చాన్స్ కోసం నిర్మాత గదిలోకి వెళ్లమన్నారు: నటి
Published Wed, Mar 24 2021 2:48 PM | Last Updated on Thu, Mar 25 2021 4:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment