
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. బీ టౌన్ సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తోన్న కంగనా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది. ఇప్పటికే పలుసార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా మరోసారి బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో తనపై గూఢచర్యం చేస్తున్నారంటూ రణ్‌బీర్ కపూర్‌ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: థియేటర్లో లైంగిక వేధింపులు.. ఏం చేయాలో అర్థం కాలేదు: స్టార్ హీరోయిన్)
తాజాగా కంగనా రనౌత్ రణబీర్‌ను 'దుర్యోధనునితో' పోలుస్తూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌ను శకునిగా అభివర్ణించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక ఈ దుష్టశక్తులు ఉన్నాయంటూ పరోక్షంగా ఆరోపించింది. వారి పేర్లు చెప్పకుండానే వైట్ ర్యాట్, పాపా జో అంటూ సంభోధిస్తూ కామెంట్స్ చేసింది.
కంగనా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. 'సినిమా పరిశ్రమలో రకరకాల బెదిరింపులు ఉన్నాయి. అయితే ఈ దుర్యోధనుడు (తెల్ల ఎలుక),శకుని (పాప జో) జోడి వేధింపులు మరింత దారుణంగా ఉన్నాయి. వారు తమను తాము సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖగా ఫీలవుతారు. బాలీవుడ్ పరిశ్రమకు ఈ విషయం తెలుసు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక ప్రధాన నిందితులు వీరే. అతన్ని ఆత్మహత్యకు పురికొల్పింది వీరే. నాపై అన్ని రకాల అసభ్యకరమైన పుకార్లను కూడా వ్యాప్తి చేశారు. నా జీవితంలో వారి వేధింపులు మించిపోయాయి.' అంటూ రాసుకొచ్చారు.
గతంలో హృతిక్ రోషన్‌తో వివాదంలో కూడా వీరిద్దరు తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించింది. బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన కంగనా తన సంచలన కామెంట్స్‌తో మరోసారి బీటౌన్‌లో చర్చ మొదలైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు ప్రేరేపించారని పరోక్షంగా రణ్‌బీర్, కరణ్‌ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారనుంది.
(ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!)
Comments
Please login to add a commentAdd a comment