
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి దాదాపు మూడేళ్లు అవుతోంది. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. తనది ఆత్మహత్య కాదని హత్యేనని అభిమానులు వాదిస్తూనే ఉన్నారు. ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తూ సుశాంత్ బాడీపై గాయాలున్నాయని అతడి పోస్ట్‌మార్టమ్‌కు హాజరైన సిబ్బంది రూప్‌కుమార్ మీడియాకు వెల్లడించడంతో మరోసారి సుశాంత్ మరణంపై చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే సుశాంత్ మరణించిననాటినుంచి అతడి ఫ్లాట్ ఖాళీగా ఉంటూ వస్తోంది. ఎవరూ ఆ ఇంట్లో అద్దెకు దిగడానికి ముందుకు రాలేదు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఓ కుటుంబం ఆ ఫ్లాట్‌లో ఉండేందుకు ముందుకు వచ్చిందట.
రియల్ ఎస్టేట్ ఏజెంట్ రఫీక్ మర్చంట్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. 'సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న ఇంట్లోకి వచ్చేందుకు మొదట ఎవరూ ముందుకు రాలేదు. కొందరు రావాలనుకున్నా చివరికి వారి కుటుంబం వద్దనడంతో ఆగిపోయారు. దీనివల్ల ఇంటి యజమాని చాలా కంగారుపడ్డారు. కానీ కాలక్రమేణా ఆ భయాలు కొంత దూరమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ ఇంటిపై కొందరు మక్కువ చూపిస్తున్నారు. ఓ ఫ్యామిలీ ఆ ఇంట్లో అద్దెకు దిగేందుకు సిద్ధమైంది. నెలకు రూ.5 లక్షలు అద్దె. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.30 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఇది ఆరునెలల రెంట్‌తో సమానం' అని చెప్పాడు. కాగా 2019లో సుశాంత్ ఈ ఫ్లాట్‌కు షిఫ్టయ్యాడు. నెలకు రూ.4.51 లక్షల చొప్పున అద్దె చెల్లించేవాడు.
చదవండి: వినరో భాగ్యము విష్ణు కథ.. యంగ్ హీరో ఫ్యాన్స్‌కు బంపరాఫర్
జోర్దార్‌గా సుజాత బర్త్‌డే సెలబ్రేషన్స్, ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment