ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తికి వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించిన మహిళ యూటర్న్ తీసుకున్నారు. సుశాంత్ మరణించే ముందు రోజు రియా చక్రవర్తి ఆయనను కలిశారని ఆరోపించిన రియా పొరుగింటి మహిళ సీబీఐ ముందు తన ఆరోపణలపై వెనక్కి తగ్గారు. దర్యాప్తు ఏజెన్సీ ఎదుట స్టేట్‌మెంట్ ఇవ్వకపోవడంతో తప్పుడు సమాచారం ఇవ్వడంపై మహిళను సీబీఐ హెచ్చరించింది. మీడియా ఎదుట తప్పుడు ప్రకటనలు చేసే వారందరిపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఇలాంటి వారితో కూడిన జాబితాను సీబీఐకి అందచేస్తామని రియా న్యాయవాది వెల్లడించారు. చదవండి : రియాకు బెయిల్
దర్యాప్తు ప్రక్రియను తప్పుదారిపట్టించిన వారిపై చర్యలు చేపట్టాలని సీబీఐని కోరతామని చెప్పారు. మరోవైపు ముంబై బైకుల్లా జైలులో దాదాపు నెలరోజులు గడిపిన రియా గత వారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ రాజ్‌పుత్ (34) ముంబైలోని బాంద్రా అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా ముంబై పోలీసులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం ఎయిమ్స్ వైద్యులు సైతం సుశాంత్ మరణం ఆత్మహత్యేనని ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment