యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! బాలీవుడ్ సెలబ్రిటీలు సుశాంత్‌ను పట్టించుకోలేదని, అతడిని సైడ్ చేయడం వల్లే సుశాంత్ కుమిలిపోయి ఆత్మహత్యకు యత్నించాడంటూ అభిమానులు విమర్శలు గుప్పించారు. ఇప్పటికీ సుశాంత్‌ను తలుచుకుంటూ నిత్యం అతడి ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటారు.
తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సుశాంత్ విషయంలో తానిప్పటికీ బాధపడుతున్నానన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'అందరి ముందు అరుస్తున్నానని నాకు చాలా లేట్‌గా తెలిసొచ్చింది. కొన్ని విషయాలను గ్రహించడానికి నాకు ఏడాదిన్నర పట్టింది. సోషల్ మీడియా వచ్చాక నేను వెనక్కు తగ్గాను. ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదని గ్రహించాను.
సుశాంత్ మరణంతో చాలా కుంగిపోయాను. తను చనిపోవడానికి మూడు వారాల ముందు సుశాంత్ టీమ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అతడు నాతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాడని, నాతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పారు. నేను మాత్రం కుదరదు, మాట్లాడనని చెప్పేశా. గతంలో నా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడన్న కోపంతో అలా మాట్లాడాను. కానీ సుశాంత్ చనిపోయాక ఎంత గిల్టీగా ఫీలయ్యానో! తర్వాత ఓసారి అభయ్‌కు ఫోన్ చేసి అతడికి సారీ చెప్పాను. ఎందుకంటే నేను పబ్లిక్‌గా అతడి గురించి మాట్లాడినందుకు తను హర్ట్ అయ్యాడని తెలిసింది. అందుకే మరేం ఆలోచించకుండా క్షమాపణలు చెప్పాను' అని చెప్పుకొచ్చాడు అనురాగ్ కశ్యప్.
I am sorry that I am doing this but this chat is from three weeks before he passed away. Chat with his manager on 22 May .. havent don’t it so far but feel the need now .. yes I didn’t want to work with him for my own reasons .. https://t.co/g4fLmI5g9h pic.twitter.com/cHSqRhW9BD
— Anurag Kashyap (@anuragkashyap72) September 9, 2020
చదవండి: నా కన్నీళ్లు నేనే తాగి బతికిన.. నన్నాపకుండ్రి..: రచ్చ రవి
కీర్తి సురేశ్ పెళ్లి.. వరుడెవరో తెలిసిపోయింది
Comments
Please login to add a commentAdd a comment