
అంకిత లోఖండే
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో తోలగించకపోవడంపై సుశాంత్ సహా నటి అంకిత లోఖండే అసహనం వ్యక్తం చేశారు. ఆ వీడియోను వెంటనే తొలగించాలంటూ అభిమానిని అభ్యర్థించారు. మీ అభిమాన నటుడుకి ప్రేమ, మద్దతు చూపడానికి ఇది తగిన మార్గం కాదని అభిమానికి సూచించారు. ‘మీరు ఏం చేస్తున్నారో అర్థం అవుతోందా. ఇలాంటి వీడియోలను పోస్టు చేయడం మానేయండి, అవి మనందరికి ఇబ్బందిని కలిగిస్తాయి’ అంటూ అంకిత ట్వీట్ చేశారు. పవిత్ర రిషిత టీవీ సీరియల్‌లో సుశాంత్‌కు జోడిగా అంకిత నటించిన విషయం తెలిసిందే. ఆ సీరియల్ సమయంలో వారిద్దరూ డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. (చదవండి: ‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’)
సుశాంత్ మృతి అనంతరం ఓ అభిమాని అతడి అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశాడు. అది చూసిన అంకిత ఆ వీడియోను తొలగించాల్సిందిగా అభిమానిని అభ్యర్థించారు. ‘మీరు సుశాంత్‌ను ప్రేమిస్తున్నారని తెలుసు. కానీ మీ మద్దతు, అభిమానాన్ని చాటుకోవడానికి ఇది మార్గం కాదు. ఈ వీడియోను వెంటనే తొలగించండి’ అంటూ గతంలో కోరారు. జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడికి సంబంధించిన జ్ఞాపకాలను అంకిత తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే సుశాంత్ అంత్యక్రియలకు అంకిత హాజరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment