
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి సోషల్ మీడియాకు దూరంగా ఉంది. కానీ ఇప్పుడు, ఆమె తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన సందేశాలను పంచుకుంటుంది. ఇటీవల, నటి జీవితం గురించి ఒక విషయాన్ని షేర్ చేసింది. రియా చక్రవర్తి తన ఇన్‌స్టా గ్రామ్‌లో 'నవ్వుతూ ఉండు.. ఎందుకంటే ఇప్పుడున్నదే జీవితం' అంటూ నవంబర్ 16న స్టోరీ షేర్ చేసింది. అలాగే దానికి 'ఇట్స్ ఓకే టు నాట్ బీ ఓకే' అని ఒక హ్యాష్‌ట్యాగ్‌ను ఇచ్చింది. సెండింగ్ యూ లవ్ అంటూ అని కూడా రాసి లవ్ ఎమోజీని పెట్టి స్టోరీని ముగించింది.
జూన్ 14న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదటి వర్ధంతి సందర్భంగా సుశాంత్‌తో ఉన్న చిత్రాన్ని షేర్ చేసింది రియా. ఆ పోస్ట్‌లో 'నువ్వు ఇక్కడ లేవని నేను నమ్మే క్షణం కూడా లేదు. సమయం అన్నింటిని నయం చేస్తుందని అంటారు. కానీ నా సమయం, నా సర్వస్వం అన్ని నువ్వే. అవును నువ్ ఇప‍్పుడు నన్ను కాపాడే సంరంక్షకుడివి అని నాకు తెలుసు. చంద్రుని నుంచి టెలిస్కోప్‌తో నన్ను చూస్తున్నావు, నన్ను రక్షిస్తున్నావు.' ఇలా ప్రేమగా రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment