
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలగులోకి వచ్చిన నటి రియా చక్రవర్తి ప్రస్తుతం కెరీర్‌పై దృష్టిపెట్టింది. సినిమాల్లో తిరిగి నటించేందుకు సిద్ధమయ్యింది. అయితే ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదు. ఇండస్ర్టీలో తనకు బాగా తెలిసివాళ్లు ఉన్నా ఆమెకు అవకాశాలు ఇప్పించలేకపోతున్నారు. దీంతో రియా చూపు ఇప్పుడు తెలుగు సినిమాలపై పడింది. గతంలో తూనీగ తూనీగ సినిమాతో రియా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగా హీరో కళ్యాణ్‌దేవ్‌తోనూ ఓ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కే మకాం మార్చింది. అక్కడ సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా పాపులర్ అయిన రియా ఆ తర్వాత సుశాంత్ రికమండేషన్ వల్లే కొన్ని సినిమా ఆఫర్లను అందుకున్నట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి.
అంతేకాకుండా సుశాంత్ సినిమాలో తననే హీరోయిన్‌గా పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేసేదని కూడా సమాచారం. ఆ తర్వాత సుశాంత్ హత్య, బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో రియా చక్రవర్తిని కోర్టు ప్రధాన నిందితురాలిగా తేల్చింది. దాదాపు నెల రోజుల జైలు జీవితం అనంతరం అక్టోబర్‌లో ఆమె బెయిల్‌పై విడుదలయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోందట. బాలీవుడ్ తలుపు తట్టినా ఛాన్సులు రాకపోవడంతో ఇప్పుడు తెలుగు ఇండస్ర్టీ వైపు ఆశగా చూస్తుందట. మరి రియాకు తెలుగులో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి మరి.
చదవండి: రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు
భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్
Comments
Please login to add a commentAdd a comment