Sushant Singh Rajput Pet Dog Fudge Died 3 Years After Actor's Death, See Fans Reactions - Sakshi
Sakshi News home page

Sushant Singh Rajput: సుశాంత్‌ చనిపోయి మూడేళ్లు.. మరణించిన పెంపుడు శునకం

Published Tue, Jan 17 2023 11:31 AM | Last Updated on Tue, Jan 17 2023 11:59 AM

Sushant Singh Rajput Pet Dog Fudge Died - Sakshi

దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ పెంపుడు కుక్క ఫడ్జ్‌ మరణించింది. ఈ బాధాకర విషయాన్ని సుశాంత్‌ సోదరి ప్రియాంక సింగ్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది. 'ఫడ్జ్‌.. స్వర్గంలో ఉన్న నీ ఫ్రెండ్‌ దగ్గరకు వెళ్లిపోయావు. మేము కూడా ఏదో ఒకరోజు మిమ్మల్ని అనుసరిస్తాం.. అప్పటివరకు మాకీ బాధ తప్పదు' అని భావోద్వేగంతో ట్వీట్‌ చేసింది. దీనికి సుశాంత్‌, తాను కుక్కతో కలిసి దిగిన పాత ఫోటోలను జత చేసింది. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు శునకం మరణంపై విచారం వ్యక్తం చేశారు.

'యజమాని చనిపోయిన తర్వాత కుక్క సంతోషంగా, ఎప్పటిలా మామూలుగా ఉండలేదు. ఆ బాధతోనే ఇన్నేళ్లు బతికి చివరికి తన యజమానిని చేరుకుంది', 'సుశాంత్‌ గురించి ఏ చిన్నవార్త తెలిసినా తట్టుకోలేకపోతున్నాను.. ఇప్పుడు ఫడ్జ్‌ చనిపోయిందంటే దుఃఖం దానంతటదే వస్తోంది.. మిస్‌ యూ ఫడ్జ్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే సుశాంత్‌ ఫడ్జ్‌తో ఆడుకున్న వీడియోలను సైతం షేర్‌ చేస్తున్నారు. కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 2020లో జూన్‌ 14న మరణించాడు. ఆయన ఈ లోకాన్ని విడిచి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ ఆయన మరణంపై అనుమానాలు వీడనేలేదు.

చదవండి: టీమిండియాతో జూనియర్‌ ఎన్టీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement