When Vaishali Takkar Reacted To Sushant Singh Rajput Death, Called It A Murder - Sakshi
Sakshi News home page

Vaishali Takkar: విషాదం.. సుశాంత్‌ బాటలోనే అతడి క్లోజ్‌ఫ్రెండ్‌..

Published Sun, Oct 16 2022 4:31 PM | Last Updated on Sun, Oct 16 2022 5:50 PM

When Vaishali Takkar Said Sushant Singh Rajput Death Looks Like Murder - Sakshi

ప్రముఖ సీరియల్‌ 'యే రిష్తా క్యా కెహ్లాతా హై' నటి వైశాలి టక్కర్‌(30) ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని తన నివాసంలో ఆదివారం ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైందని పోలీసులు తెలిపారు. కాగా వైశాలి.. దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు అత్యంత ఆప్త మిత్రురాలు. 2020లో జూన్‌ 14న సుశాంత్‌ సూసైడ్‌ చేసుకున్నప్పుడు వైశాలి అతడి మరణాన్ని జీర్ణించుకోలేక రెండు మూడురోజులపాటు ఏకధాటిగా ఏడ్చింది.

ఆ సమయంలో స్పాట్‌బైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్యేనని అందరూ అంటున్నారు. అతడి మృతదేహం మీద ఉన్న కొన్ని గుర్తులను చూస్తుంటే ఎక్కడో ఏదో జరిగిందనిపిస్తోంది. ఏ ఒక్కరో ఈ పనికి పూనుకోలేదు. మూవీ మాఫియానే అతడిని చంపేసింది. అసలు నిందితులు నటి రియా చక్రవర్తి వెనకాల దాక్కునేందుకు ప్రత్నిస్తున్నారు. అలా అని రియా తప్పు లేదనట్లేదు. సుశాంత్‌ అలాంటి దుస్థితికి రావడానికి ఆమె కూడా ఓ కారకురాలే'నని మండిపడింది. తన స్నేహితుడు అన్యాయంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడని బాధపడిన వైశాలి.. చివరకు సుశాంత్‌ బాటలోనే నడిచి సూసైడ్‌ చేసుకోవడం గమనార్హం.

చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య
ఉత్కంఠ రేపుతున్న మిలి ట్రైలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement