Sushant Singh Rajput Birthday Anniversary: నువ్వు మా జీవితాల్లో భాగం - Sakshi
Sakshi News home page

సుశాంత్‌ బర్త్‌ డే: నువ్వు మా జీవితాల్లో భాగం

Jan 21 2021 10:51 AM | Updated on Jan 21 2021 1:28 PM

Sushant Singh Rajput Sister Shweta Remembering On His Birthday - Sakshi

జనవరి 21 సుశాంత్‌ మొదటి జయంతి సందర్భంగా అభిమానులు, సన్నిహితులు, సహా నటీనటులు భావోద్యేగానికి లోనవుతూ సోషల్‌ మీడియాలో ఆయన ఫొటోలను షేర్‌ చేస్తున్నారు

ముంబై: నేడు బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 35వ పుట్టిన రోజు. జనవరి 21 సుశాంత్‌ మొదటి జయంతి సందర్భంగా అభిమానులు, సన్నిహితులు, సహా నటీనటులు భావోద్యేగానికి లోనవుతూ సోషల్‌ మీడియాలో ఆయన ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. అదే విధంగా సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్‌ ​కూడా అతడి ఫొటోలను పంచుకున్నారు. దీనికి ‘లవ్‌ యూ భాయ్‌.. మీరు మా జీవితంలో భాగం. నిన్ను ఎప్పటికి మర్చిపోలేము’ అంటూ షేర్‌ చేసిన ఈ ఫొటోలో సుశాంత్‌ తన మేనల్లుడు, మేనకోడలును ఎత్తుకుని సరదాగా వారితో ఆడుతూ కనిపించాడు. దీంతో శ్వేతా పోస్టు చూసిన సుశాంత్‌ అభిమానులు ‘లెజెండ్స్‌కు మరణం లేదు’, ‘సుశాంత్‌ ఎప్పటికి మన గుండెల్లో బ్రతికే ఉంటారు. ఈ రోజు సుశాంత్‌ మనతోనే ఉంటారని ఆశిస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అదే విధంగా ‘వన్‌ డే టూ ఎస్‌ఎస్‌ఆర్‌ బర్త్‌డే’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా వైరల్‌ చేస్తున్నారు. (చదవండి: భావోద్వేగం: సుశాంత్‌ రాసుకున్న లేఖ వైరల్‌)

ఇక బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు సైతం సుశాంత్‌ను గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. కాగా గతేడాది జూన్‌ 14న సుశాంత్ తన ముంబై ఇంటిలో ఉరివేసుకుని చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత్ మరణానికి అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఈ కేసులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎంట్రీ మొదలు రోజుకో పరిణామంతో అనేక మలుపులు తిరుగుతూ చివరికి రాజకీయ సెగలు రేపింది. మాదక ద్రవ్యాల కోణం కూడా వెలుగు చూడటంతో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) రియాను, ఆమె సోదరుడిని అరెస్ట్  చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌ నటీనటుల పేర్లు కూడా బయటకు రావడంతో వారందరిని విచారించింది. ఈ నేపథ్యంలో ఇటీవల రియా, ఆమె సోదరుడు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి: సుశాంత్‌ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది: హైకోర్టు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement