![Bombay HCt Reserves Order On Rhea Chakraborty Bail Application - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/29/sss.jpg.webp?itok=VOrRGqD7)
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిలు పిటిషన్‌పై బాంబే హైకోర్టు నేడు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. వీళ్లతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తుల అభ్యర్థనపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో రిమాండ్‌లో ఉన్న రియా బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఇక గతంలో రియా బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చిన నేపథ్యంలో ఇప్పుడైనా ఆమెకు బెయిల్ వస్తుందా లేదా అన్న విషయం ఆసక్తిని రేపుతోంది. (‘అత్యంత తీవ్రమైన నేరం’.. బెయిల్ వస్తుందా?)
కాగా సుశాంత్ సింగ్ మృతి నేపథ్యంలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి.. డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో సెప్టెంబరు 9న రియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను బైకుల్లా జైలుకు తరలించారు. రియా చెప్పిన వివరాల ఆధారంగా పలువురు సెలబ్రిటీల కదలికలపై అధికారులు నిఘా వేశారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా వాట్సాప్ చాట్స్ బహిర్గతమైన నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులను ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. (3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?)
Comments
Please login to add a commentAdd a comment