కోలకతా: నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు, మాదక ద్రవ్యాలు వినియోగించారనే ఆరోపణలపై అరెస్టయిన నటి రియా చక్రవర్తికి కాంగ్రెస్ పార్టీ తమ మద్దతును కొనసాగిస్తోంది. రియాకు అండగా శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతాలో ఆ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. రియాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేయడంపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ఇప్పటికే మండిపడుతోంది. రియా బెంగాలీ బ్రాహ్మణ అమ్మాయి అని, ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అని, ఆయన దేశానికి సేవ చేశారంటూ ఇటీవల ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
సుశాంత్ అనుమానాస్పద మరణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ఆత్మహత్యకు అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో నెపోటిజం ఆరోపణలు చేసిన మరో హీరోయిన్ కంగనా రనౌత్ ఈ కేసులో కీలకంగా మారింది. మానసిక అనారోగ్యం, నెపోటిజం..ఇలా రోజుకో పరిణామం మధ్య ఈ కేసు తాజాగా డ్రగ్ మాఫియా తుట్టెను కదుపుతోంది. అటు ఈ కేసు రాజకీయ టర్న్ తీసుకుని, బీజేపీ శివసేన మధ్య సెగలు పుట్టిస్తోంది. బిహార్, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈకేసుపై సీబీఐ విచారణ జరుపుతోంది. (డ్రగ్స్ కేసులో రియాకు షాక్)
Comments
Please login to add a commentAdd a comment