Narcotic Drugs
-
సికింద్రాబాద్‌లో భారీగా మత్తు ఇంజక్షన్లు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్త నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో సోదాలు చేపట్టారు. జీవీ సలూజా ఆసుపత్రిలో భారీగా నార్కోటిక్ డ్రగ్స్ సీజ్ చేశారు.మౌలాలీలోని నేహా భగవత్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు నార్కోటిక్ డగ్ర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేహా భగవత్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.పెద్దమొత్తంలో సలూజా ఆసుపత్రిలో మత్తుమందును యాజమాన్యం నిల్వచేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా మత్తు మందుని దిగుమతి చేసి ఆసుపత్రి యాజమాన్యం విక్రయిస్తోంది. మహారాష్ట్రకు చెందిన నేహా భగవత్ సాయంతో మత్తు మందులు విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. -
డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం
-
ఎన్నికల్లో పట్టివేతలు : రూ.200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 16 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన సోదాల్లో రూ.200,27,60,036 విలువైన నగదు, మద్యం, మత్తుపదార్థాలు, బంగారం, వెండి, ఇతర విలువైన పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో నగదు రూ.99,16,15,968 పట్టుబడినట్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 466 ఫ్లయింగ్ స్వాడ్లు, 89 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో తనిఖీలు కొనసాగాయి.సోదాల్లో రూ.11,48,00,955 విలువైన మద్యం పట్టుబడింది. రూ.14,52,53,412 విలువైన నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 92.271 కిలోల బంగారం, 178.657 కిలోల వెండి పట్టుబడింది. ఇవికాకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెచ్చిన మరో రూ.11,91,06,661 విలువైన వస్తువులు ఉన్నాయి. ఇక 7,272 లైసెన్స్ కలిగిన ఆయుధాలను, మరో 20 లైసెన్స్‌లేని ఆయుధాలను జప్తు చేసినట్టు డీజీపీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సోదాల్లో నగదు, మద్యం, మత్తుపదార్థాలు, బంగారం, వెండి, ఇతర వస్తువులు కలిపి రూ.46.3 కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టు వెల్లడించింది. -
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? మత్తు, మందు..ఇంకా?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్‌పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలు సినిమా స్టార్స్స్పై పదే పదే ఎందుకు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు రేవ్‌పార్టీ అంటే ఏమిటి? కేవలం చిందు మందుతోపాటు, నిషేధిత మత్తుమందులు కూడా ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.రేవ్ పార్టీలు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ప్రధానంగా బడాబాబుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు రేవ్ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పలువురితోపాటు, ఇటీవల ప్రముఖ ఎల్విష్ యాదవ్‌పై ఆరోపణలు నమోదైనాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ అంటే ఏంటి? సెలబ్రిటీలకు ఎందుకంత క్రేజ్ విదేశాలతో పాటు, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీలు పరిపాటి. ఈమధ్య కాలంలో ఈసంస్కృతికి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్, మద్యంతోపాటు, డ్రగ్స్‌కూడా ఇక్కడ యధేచ్ఛగా లభ్యమవుతాయి. రేవ్ పార్టీలు కాస్తా డ్రగ్స్ పార్టీలుగా మారిపోతున్నాయి. ఫుడ్, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని సమాచారం.. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ‘రూమ్స్’ కూడా ఉంటాయట. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు.రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి.60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే. కానీ 80వ దశకంలో రేవ్ పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల ధోరణి ప్రారంభమైంది. లండన్‌లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. యుఎస్ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం.. రేవ్ పార్టీ 80ల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ కాస్తా రేవ్ పార్టీగా మారి పోయింది. మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక(ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం గంజాయికి కొకైన్, MDMA, LSD మొదలైన మత్తుపదార్థాలు , మాదకద్రవ్యాల వాడకం నిషేధం. -
అరేబియన్ సముద్ర జలాల్లో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్ర జలాల్లో భారీ మొత్తంలో మత్తుపదార్థాలను భారత నౌకాదళం స్వా«దీనం చేసుకుంది. సముద్రజలాలపై ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇరాన్‌లోని ఛబహర్ నౌకాశ్రయం నుంచి బయల్దేరి మంగళవారం ఉదయం అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సముద్రజలాల సరిహద్దు(ఐఎంబీఎల్)కు 60 నాటికల్ మైళ్ల దూరంలో భారత్ వైపు వస్తున్న ఒక అనుమానిత చేపల పడవను భారత నావికాదళ నిఘా విమానం కనిపెట్టి వెంటనే ప్రధాన కార్యాలయానికి సమాచారం చేరవేసింది. అక్కడి నుంచి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)కి సమాచారం అందింది. వెంటనే నేవీ, ఎన్సీబీ, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. పీ8ఐ నేవీ విమానం, యుద్ధనౌక, హెలికాప్టర్లు ఆ పడవను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. నౌకను ఎన్సీబీ అధికారులు తనికీచేయగా దాదాపు 3,300 కేజీల మాదకద్రవ్యాలున్న ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ ప్యాకెట్లలో 3,110 కేజీల ఛరస్/హషి‹Ù, 158.3 కేజీల స్ఫటికరూప మెథామ్ఫెటమైన్, 24.6 కేజీల హెరాయిన్ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి మొత్తం విలువ గరిష్టంగా రూ.2,000 ఉండొచ్చని ఢిల్లీలో ఎన్సీబీఐ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ అంచనావేశారు. ఆ ప్యాకెట్ల మీద ‘రాస్ అవద్ గూడ్స్ కంపెనీ, పాకిస్తాన్ తయారీ’ అని రాసి ఉంది. మత్తుపదార్థాల ప్యాకెట్లతోపాటు పడవలో ఉన్న ఐదుగురు విదేశీయులను అరెస్ట్‌చేశారు. వీరి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. వీరిని పాక్ లేదా ఇరాన్ దేశస్తులుగా భావిస్తున్నారు. వీరి నుంచి ఒక శాటిటైల్ ఫోన్, నాలుగు స్మార్ట్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. ‘భారత నావికాదళం, ఎన్సీబీ, గుజరాత్ పోలీసులు సాధించిన ఈ విజయం మత్తుపదార్థాల రహిత భారత్ కోసం కేంద్రం చేస్తున్న కృషికి నిదర్శనం’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సముద్ర జలాల్లో ఇన్ని కేజీల డ్రగ్స్ పట్టివేత ఇదే తొలిసారి. అంతకుముందు 2023 మేలో కేరళ తీరంలో 2,500 కేజీల మత్తుపదార్థాలను ఎన్సీబీ, నేవీ పట్టుకున్నాయి. -
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
-
డ్రగ్స్ అంటేనే వణుకు పుట్టాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ అంశంపై కొత్త ప్రభుత్వం ఫోకస్ చేసింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను ఉపయోగించాలంటే భయపడే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని.. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ అంశంపై సోమవారం సచివాలయంలో రేవంత్ సమీక్షించారు. ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సీవీ ఆనంద్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రేహౌండ్స్ మాదిరిగా నార్కోటిక్స్ బ్యూరో.. రాష్ట్రంలో ప్రస్తుతమున్న యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించాలని.. ఆ విభాగాన్ని బలోపేతం చేయాలని రేవంత్ ఆదేశించారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు, ఇతర సౌకర్యాలను సమకూర్చాలని సూచించారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగాన్ని నిరోధించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ల మాదిరిగా టీఎస్ నాబ్‌ను తీర్చిదిద్దాలని సూచించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్, ఔషధ నియంత్రణ మండలి, పోలీస్ శాఖలకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సినీతారల డ్రగ్స్ కేసు ఏమైంది? గతంలో సంచలనం సృష్టించిన సినీ తారల డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. ఆ కేసు గురించిన కీలక అంశాలను అధికారుల నుంచి వివరంగా తెలుసుకున్నట్టు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ పలుమార్లు సినీ తారల డ్రగ్స్ కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై స్వయంగా కోర్టును సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో సోమవారం జరిగిన నార్కోటిక్స్ సమీక్షలో సీఎం హోదాలో డ్రగ్స్ కేసు వివరాలను ఆయన తెలుసుకున్నారు. సినీతారల కేసులో ఏం జరిగింది? ఇప్పుడా కేసు స్టేటస్ ఏమిటి? దర్యాప్తు ఎలా జరిగింది? నిందితుల నుంచి సేకరించిన ఎల్రక్టానిక్ డివైజ్‌లను, ఇతర కీలక వస్తువులను ఫోరెన్సిక్ పరిశీలనకు ఎందుకు పంపలేదంటూ ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రతి ఒక్కరి విచారణ సందర్భంగా చేసిన వీడియో రికార్డింగ్‌లు, వారి కాల్‌డేటా, ఎల్రక్టానిక్ డివైజ్‌లు, ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించామని.. చార్జిషిట్ కూడా నమోదు చేశామని అధికారులు వివరించినట్టు తెలిసింది. -
బ్యాగ్‌ల అడుగున దాచి..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో కొకైన్ పట్టుబడింది. బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్ల విలువ చేసే ఐదు కిలోల కొకైన్‌ను డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు శుక్రవారంస్వాధీనం చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగ్‌ల కింద దాచి ఉంచిన కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈ మేరకు డీఆర్ఐ అధికారులు శనివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. లావోస్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్‌కు శుక్రవారం చేరుకున్నాడు. అతడు హైదరాబాద్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా, పక్కా సమాచారం మేరకు అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. సూట్‌కేస్, నాలుగు మహిళా హ్యాండ్ బ్యాగ్‌ల అడుగు భాగంలో దాచి ఉంచిన కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో మొత్తం ఐదు కిలోల కొకైన్ ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రయాణికుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ డ్రగ్ సిండికేట్‌లోని మరికొందరు ముఠా సభ్యులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. -
ఐరాస స్టాటిస్టికల్ కమిషన్‌కు భారత్ ఎన్నిక
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి అత్యున్నత గణాంకాల విభాగం యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్‌కు రెండు దశాబ్దాల తర్వాత భారత్ ఎన్నికైంది. రహస్య బ్యాలెట్ ఓటింగ్‌లో జరిగిన హోరాహోరీ పోరులో నెగ్గింది. యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ భారత్ యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్ మెంబర్‌గా, నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్‌గా, ప్రోగ్రామ్ కో ఆర్డినేటింగ్ బోర్డ్ ఆఫ్ జాయింట్ యూఎన్ ప్రోగ్రామ్ ఆన్ ఎయిడ్స్‌గా ఎన్నికైంది. -
రూ.1,000 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్లో మరోమారు భారీస్థాయిలో మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో కనీసం రూ.1,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మంగళవారం పట్టుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వడోదరలోని ఓ గోదాంపై దాడి చేపట్టింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. ఈ దాడుల్లో 200 కిలోల మెఫెడ్రోన్ దొరికినట్టు అధికారులు తెలిపారు. భరుచ్ జిల్లాలో ఔషధాల ముసుగులో దీన్ని తయారు చేసినట్టు తేలిందన్నారు. ఇందుకు సంబంధించి పలువురికి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిషేధిత మెఫెడ్రోన్‌ను మ్యావ్ మ్యావ్, ఎండీగా కూడా పిలుస్తారు. ఇదీ చదవండి: ఎంఎస్పీ కమిటీ భేటీని బహిష్కరించిన రైతు సంఘాలు -
ఉన్నా... లేనట్లే
సాక్షి, హైదరాబాద్: పోలీసు, ఆబ్కారీశాఖల్లో ఖాకీ డ్రెస్ ధరించిన ప్రతి ఉద్యోగి ప్రధాన కర్తవ్యం నేరాల నియంత్రణ. కానీ ఎక్సైజ్‌లో కొంతకాలంగా ఆ విధి నిర్వహణ కొరవడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నార్కోటిక్ డ్రగ్స్ నేరాల కట్టడిలో ఆబ్కారీ యంత్రాంగం విఫలమవుతోంది. కొందరు అధికారులు మాత్రమే నిజాయితీగా విధులు నిర్వహిస్తుండగా ఎక్కువ మంది ఎక్సైజ్ స్టేషన్ల వారీగా ఆదాయంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసు కంట్రోల్ రూమ్ తరహాలో ఆబ్కారీ శాఖలోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఆచరణలో అలంకారప్రాయంగా మారింది. దీనిపై సరైన ప్రచారం లేదు. మరోవైపు గంజాయి, కోకైక్ వంటి మత్తు పదార్థాల సరఫరాపై సమాచారాన్ని రాబట్టుకునేందుకు గతంలో బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ పని చేసేది. ఒకరిద్దరు అధికారులు అలాంటి ఇన్ఫార్మర్ల నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే డ్రగ్స్ నియంత్రణలో మంచి ఫలితాలను సాధించారు. కానీ ఇప్పుడు కంట్రోల్ రూమ్, ఇన్ఫార్మర్ వ్యవస్థ రెండూ దాదాపుగా నిర్వీర్యమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో డ్రగ్స్ సరఫరా, విక్రేతలను, బాధితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎక్సైజ్‌శాఖ పనితీరు పరిమితంగా మారింది. పోలీసులకు ధీటైన యంత్రాంగం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. వంద తరహాలో 24733056 నంబర్ .... ఒకవైపు రాడిస్బ్లూ హోటల్ వంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నప్పటికీ మరోవైపు గంజాయి, ఇతర మత్తుపదార్థాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా మత్తుపదార్థాలు సరఫరా అవుతున్నాయి. అంతేకాకుండా స్కూళ్లు, కాలేజీలు, నగర శివార్లే ప్రధాన అడ్డాలుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2016లో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. స్కూళ్లు, కాలేజీల నుంచి నేరుగా సమాచారం అందేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 2017 వరకు ఈ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసింది. 24 గంటల పాటు ఫిర్యాదులను స్వీకరించేందుకు సిబ్బందిని నియమించారు. ఎక్కడి నుంచైనా టోల్ ఫ్రీ నంబర్ 24733056కు సమాచారం అందజేయవచ్చు. ఇప్పటికీ ఈ నంబర్ అందుబాటులో ఉన్నప్పటికీ సరైన ప్రచారం లేకపోవడం వల్ల పెద్దగా ఫిర్యాదులు అందడం లేదు. బెల్ట్‌షాపులు, మైనర్లకు మద్యం అమ్మకాలు వంటి వాటిపైనే తరచు ఫిర్యాదులు అందుతున్నాయి.. కానీ నార్కోటిక్ నేరాలపైన రావడం లేదని ఓ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఇన్ఫార్మర్ వ్యవస్థ లేకపోవడం కూడా ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. బర్త్‌డే పార్టీలు, వేడుకలే లక్ష్యం... బర్త్‌డే పార్టీలు, యువత ఎక్కువగా గుమిగూడేందుకు అవకాశం ఉన్న వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఒకరి నుంచి ఒకరికి ఈ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఒక పార్టీలో నలుగురు కొత్తవాళ్లు గంజాయిని సేవిస్తే ఆ నలుగురు మరో నలుగురికి దాన్ని అలవాటు చేస్తున్నారు. ఇలా వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరిస్తుంది. నగరంలోని ధూల్‌పేట్, నానక్‌రామ్‌గూడ, నేరేడ్మెట్, శేరిలింగంపల్లి, సూరారం, జీడిమెట్ల, కొంపల్లి, బోయిన్పల్లి, నాగోల్, కాప్రా, తదితర ప్రాంతాలు ప్రధాన అడ్డాలుగా మారాయి. (చదవండి: లగేజ్ బ్యాగేజ్‌లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
డ్రగ్స్‌ను అరికట్టడంలో ప్లాప్.. కొరవడిన నిఘా!
సాక్షి, హైదరాబాద్: ఆక్టోపస్‌లా విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ విఫలమవుతోంది. స్టార్ హోటళ్లు, పబ్‌లలో డ్రగ్స్ సరఫరా వ్యవస్తీకృతంగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సూపరింటెండెంట్ స్థాయి ఎక్సైజ్ అధికారులు, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు, సీఐలు, ఎస్సైలు తదితర అధికారగణంతో బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ బలగాలు బెల్టు షాపులు, మద్యం విడి విక్రయాల నియంత్రణ వంటి సాధారణ ఉల్లంఘనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. కీలకమైన నార్కోటిక్స్ నేరాలను మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. దీంతో స్కూళ్లు, కాలేజీలు, పబ్‌లు, హోటళ్లు లక్ష్యంగా చేసుకొని నేరగాళ్లు గంజాయి, కొకైన్, హాష్ ఆయిల్ వంటి వివిధ రకాల మత్తు పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. మరోవైపు ఎక్సైజ్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయలోపం కూడా నేర నియంత్రణలో ఆ శాఖ వైఫల్యానికి కారణమవుతోంది. ప్రధానంగా రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలకు, జిల్లాస్థాయి నిఘా విభాగాలకు, మొబైల్ టాస్క్ఫోర్సు బృందాలకు మధ్య సరైన సహకారం, సమన్వయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు అధికారులు అంకితభావంతో పని చేసినా వారికి సరైన ప్రోత్సాహం, ఉన్నతాధికారుల నుంచి సహకారం లభించడం లేదు. దీంతో నగరం నలుమూలలా డ్రగ్స్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. తాజాగా రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్‌లో పోలీసుల తనిఖీల్లో కొకైన్ లభించడం ఎక్సైజ్ శాఖ వైఫల్యానికి నిదర్శనమని ఆ శాఖకు చెందిన ఒకరిద్దరు అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. మొక్కుబడి తనిఖీలు.. ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లలో నిర్వహించే మొక్కుబడి తనిఖీలు నెలవారీ మామూళ్ల కోసమే కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని అనేక చోట్ల పబ్‌లు, హోటళ్లలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తెలిసినా చూసీ చూడకుండా వదిలేస్తున్నారు. మరోవైపు రాత్రింబవళ్లు తెరిచి ఉంచినా, మైనర్లను అనుమతించినా పట్టించుకోవడం లేదు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, అమీర్‌పేట్, సికింద్రాబాద్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ‘తమ వల్లనే మద్యం అమ్మకాలు పెరిగి భారీ ఆదాయం వచ్చినట్లు కొందరు అధికారులు తమ పనితనానికి నిదర్శనంగా చెబుతారు. కానీ వాళ్ల ప్రమేయం లేకుండానే అమ్మకాలు జరుగుతాయి. ఆదాయం వస్తుంది’ అని ఓ అధికారి చెప్పారు. అక్రమార్జనపై ఉన్న ధ్యాస నేరనియంత్రణలో లేకపోవడంతో మాఫియా జడలు విప్పుతోందనే విమర్శలున్నాయి. సీఎం ఆదేశించినా అంతే సంగతులు.. డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిన హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆదేశించినా ఆచరణలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. గతంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కీలక విధులు నిర్వహించిన కొందరు అధికారులను బదిలీ చేయడంతో చాలా నష్టం వాటిల్లింది. తాజాగా జరిగిన పదోన్నతులు, బదిలీలతో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ వ్యవస్థ తిరిగి బలోపేతమయ్యే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. (చదవండి: ఆ మూడు టేబుళ్లే కీలకం!) -
డీజే కమ్స్ డ్రగ్ అడిక్ట్... డ్రగ్ డీలర్
సిటీలో డిస్క్ జాకీలుగా కదం తొక్కుతున్న కుర్రాళ్లు డ్రగ్స్ కీలల్లో మాడిమసైపోతున్నారు. టీనేజ్ యువతకు క్రేజీ ప్రొఫెషన్‌గా ఇట్టే ఆకట్టుకునే ఈ వృత్తి ఇప్పుడు కొందరి పాలిట యమపాశంగా మారుతోంది. వారు నచ్చి మెచ్చిన సంగీతమే వారి చుట్టూ మరణమృదంగం మోగిస్తోంది. చుట్టూ లగ్జరీ.. వ్యసనాలపై సవారీ... సిటీ పబ్స్‌లో, క్లబ్స్‌లో ఈవెంట్లలో డీజెలుగా పనిచేసే కుర్రాళ్లలో అత్యధికులు మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవారే. అరకొరగా ఉన్న డీజె స్కూల్స్‌లో లక్షలు వెచ్చించి కోర్సు చేసే ఈ కుర్రాళ్లకు ఆ తర్వాత జీతంగా లభించేది అంతంత మాత్రం. రూ.15 నుంచి 25 వేల లోపు జీతమే అయినప్పటికీ మ్యూజిక్ మీద ఉన్న క్రేజ్‌తో వీరు ఉద్యోగాలకు సై అంటారు. తదనంతరం వీరి చుట్టూ విలాసవంతమైన సమాజమే జతవుతుంది. మద్యపానం, ధూమపానం సర్వసాధారణ వ్యసనాలుగా మారతాయి. ఖర్చులకు ఏ మాత్రం సరిపోకపోవడంతో తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుంది. డిజె ముదిరి డ్రగ్ అడిక్ట్...డ్రగ్ డీలర్‌గా కూడా మారతాడు. మరోవైపు తాజా కరోనా, లాక్డౌన్ టైమ్‌లో పూర్తి ఆదాయం కోల్పోయిన డీజెలలో కొందరు మ్యూజిక్‌ని వదిలేసి ఇతర రంగాల్లోకి వెళ్లిపోతే..మరికొందరు ఇళ్లలో కూర్చుని ఆన్లైన్ ద్వారా ప్రొఫెషనల్ డ్రగ్స్ డీలర్లుగా మారిపోయారని సమాచారం. రేర్...రేవ్ బృందాలు... పబ్స్, క్లబ్స్‌కు వచ్చే కస్టమర్లకు బాగా సన్నిహితంగా మారేవాళ్లలో డీజేలే ముందుంటారు. కాబట్టి వెర్రెత్తించే సంగీతాన్ని ఇష్టపడేవారిని గుర్తించడం వీరికి సులభం. దీంతో ఈ రకమైన సంగీతాన్ని ఇష్టపడుతున్న వారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడుతున్నారు. నగరంలో ప్రత్యేక పార్టీలను డీజేలు నిర్వహిస్తున్నారు. సదరు పార్టీల్లో రాజ్యమేలేదంతా అపరిమిత మత్తు...అందులో పడి చిత్తవ్వడమే. మెట్రోలతో మ్యూజిక్ అనుసంధానం.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటీలో డీజేలే నార్కొటిక్స్ కేసుల్లో బుక్ అవుతున్నారు. గోవాలో ఇది నిత్యకృత్యం అయింది కోట్ట రూపాయల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు వీక్లీ రైడ్స్‌లో వారి నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. చెన్నైకి చెందిన సౌండ్ ఇంజనీరింగ్ విద్యార్ధిని అరెస్ట్ చేసి రూ.8లక్షలు విలువైన సెకోట్రోపిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూర్లో పనిచేసే డీజే ధీరజ్ని అరెస్ట్ చేసినప్పుడు అతను హైదరాబాద్ సహా పలు నగరాల్లో క్లయింట్స్ ఉన్నట్టు చెప్పినట్టు సమాచారం. విదేశీ రాక...డ్రగ్స్‌కు కాక... డ్రగ్స్ హబ్ లాంటి గోవా చీప్ నార్కోటిక్స్‌కు కూడా పేరొందింది. దానితో గోవా డీజేలకు నగరం నుంచి డిమాండ్ పుంజుకుంది. అయితే అక్కడ వారానికోసారి డ్రగ్ రైడ్ నిర్వహిస్తున్నారు నార్కొటిక్ యాక్టివిటీస్‌లో జోక్యం పెరిగిందనే కారణంగా 2013లో గోవా íసీఎం విదేశీ డీజేలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దాంతో హైదరాబాద్ వైపు వీరు తమ చూపు మరల్చారని తెలుస్తోంది నగరానికి విదేశీ డీజేలను రప్పించడం కూడా డ్రగ్ కల్చర్‌కి ఊపు తెస్తోంది. (చదవండి: తలొగ్గేది ప్రేమకే.. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలిని: తమిళిసై) -
అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు
ఇండోర్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఆన్లైన్లో గంజాయిని విక్రయిస్తుందనే ఆరోపణలతో అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై మధ్యప్రదేశ్ పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో పోలీసులు గతవారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సుమారు 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. (చదవండి: 11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య) అంతేకాదు తాము అమెజాన్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ డ్రగ్ స్మగ్లింగ్ గంజాయి స్మగ్లింగ్‌ను ఛేదించినట్లు పేర్కొన్నారు. దీంతో కాన్ఫెడరేషన్ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌పై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అమెజాన్ ఇండియా ప్రతినిధి దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం, మద్దతును ఇస్తానని హామీ కూడా ఇచ్చిన సంగతని ఈ సందర్భంగా పోలీసులు గుర్తుచేశారు. పైగా అమెజాన్ సంస్థ సకాలంలో స్పందించి అందించిన వివరాలు తాము వెలకితీసిన సాక్ష్యాధారాలకు విరుద్ధంగా ఉన్నట్లు కూడా వెల్లడించారు. అంతేకాదు వివిధ చిరునామాలకు బుక్ చేసి డెలివరీ చేసిన 20 నిషేధిత సరుకుల వివరాలు ఇంకా అందాల్సి ఉందని భింద్ ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ..."ఈ కేసు విచారణకు ఈ-కామర్స్ దిగ్గజం సహకరించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఆన్లైన్ వ్యాపారాలకు ఎటువంటి మార్గదర్శకాలు లేవు. అంతేకాదు అమెజాన్‌కు కాల్ చేసినా వారు స్పందించడం లేదన్నారు. దయచేసి మాకు సహకరించండి లేనట్లయితే అమెజాన్ ఎండీ సీఈవోకి విజ్ఞప్తి చేస్తాం లేదా తదుపరి చర్యలు త్వరిత గతిన ప్రారంభిస్తాం" అని హెచ్చరించారు. (చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!!) -
రెగ్యులర్‌గా డ్రగ్స్ వాడుతాడేమో
ముంబై: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తరచుగా మత్తు పదార్థాలను వినియోగిస్తాడనే భావన కలుగుతోందని ముంబైలోని స్పెషల్ కోర్టు వ్యాఖ్యానించింది. ముంబైలోని క్రూయిజ్ నౌకలో మత్తు పదార్థాలు పట్టుబడిన కేసులో అరెస్టయిన ఆర్యన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, ఫ్యాషన్ మోడల్ మున్మున్ ధమేచల బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్యన్ వాట్సాప్ చాట్స్‌ను పరిశీలిస్తే డ్రగ్స్ విక్రేతలను తరచూ కలుస్తాడనే విషయం స్పష్టమవుతోందని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టాల సంబంధ కేసులను విచారించే కోర్టు స్పెషల్ జడ్జి వీవీ పాటిల్ వ్యాఖ్యానించారు. ‘కేసులో ఆధారాలుగా కోర్టుకు ఎన్సీబీ సమర్పించిన ఆర్యన్ వాట్సాప్ చాట్స్‌ను గమనిస్తే ఇతనికి రెగ్యులర్‌గా డ్రగ్స్ వాడే అలవాటుందని తెలుస్తోంది. ఆర్యన్‌కు బెయిల్ ఇస్తే బయటికొచ్చాక మళ్లీ ఈ తప్పు చేయబోడని మేం ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాం. అందుకే బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం’ అని కోర్టు ఉత్తర్వులో జడ్జి వ్యాఖ్యానించారు. ‘నౌకలో సోదాల సమయంలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ లేవు. కానీ స్నేహితులు అర్బాజ్, మున్మున్ల వద్ద డ్రగ్స్ ఉన్నాయనే విషయం ఆర్యన్‌కు తెలుసు. సరదా కోసం, వినియోగం కోసం డ్రగ్స్ వెంట తెచ్చుకుంటామని అరెస్ట్ అయ్యాక ఇచ్చిన వాంగ్మూలాల్లో ఆర్యన్, అర్బాజ్ ఒప్పుకున్నారు. డ్రగ్స్‌ను సరఫరా చేసే, విక్రయించే వ్యక్తులతో ఆర్యన్‌కు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆర్యన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. నిషేధిత డ్రగ్స్‌తో సంబంధమున్న ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు కుదరదు’ అని జడ్జి తేల్చిచెప్పారు. దీంతో ఆర్యన్ తరఫు లాయర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జస్టిస్ ఎన్ డబ్ల్యూ సాంబ్రే నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ ముందు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది. గత 18 రోజులుగా ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోనే గడుపుతున్నారు. -
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడి ఇంటిపై సోదాలు, అరెస్ట్
సాక్షి, ముంబై: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన నివాసంలో ఎన్సీబీ దాడులు నిర్వహించింది. అనంతరం ఆగస్టు 30 వరకు ఎన్సీబీ కస్టడీకి తరలించారు. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో శనివారం కోహ్లీ నివాసంలో విస్తృత దాడులు జరిగాయి.ఈ దాడుల్లో కోహ్లీ ఇంటి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరింత సమాచాం కోసం ప్రశ్నించేందుకు ఆయనను ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. కాగా 2018లో చట్టవిరుద్ధంగా మద్యం నిల్వ చేశాడన్న ఆరోపణలపై కోహ్లీని ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసింది. బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గా ఉన్నాడు కోహ్లీ. -
హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?
(వెబ్ స్పెషల్): బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణం ప్రాథమికంగా చిత్ర పరిశ్రమపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. మొదట సుశాంత్ ది ఆత్మహత్యగా మీడియాలో వార్తలు వ్యాపించినా, క్రమ క్రమంగా అనేక నీలినీడలు వెలుగు చూస్తూ వచ్చాయి. నెపోటిజం, పెద్దోళ్ల పెత్తనం, డ్రగ్ మాఫియా దాకా వరుసగా పలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. గత మూడు నెలలుగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీని తలపిస్తూ మీడియాలో సుశాంత్ సంబంధిత కథనాలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా సుశాంత్ స్నేహితురాలు, రియా చక్రవర్తి పేరు మారు మోగుతూ వచ్చింది. విచారణలో సీబీఐ, ఈడీ, ఎన్సీబీ ఎంట్రీ తరువాత కేసు స్వరూపమే మారిపోయింది. విచారణలో పలువురు బాలీవుడ్ స్టార్ల పేర్లు రియా వెల్లడించినట్లు సమాచారం. దీనిపై పార్లమెంటులో కూడా వాదోపవాదాలు జరిగాయంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా సుశాంత్ ఆత్మహత్య కేసులో మొదటినుంచీ ఏదో ఒక విధమైన వాదం, వివాదంతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పరిశ్రమంలో నెపోటిజంపై గొంతెత్తారు. బాలీవుడ్ పెద్దలపై తనదైన శైలిలో విమర్శలు రేకెత్తించారు. తదనంతర పరిణామాల్లో సుశాంత్ స్నేహితురాలు అరెస్ట్ కావడంతో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కంగన మరోసారి బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలే చేశారు. డర్టీ సీక్రెట్స్ అంటూ ట్వీట్ల దుమారం రేపారు. బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ వంటి వారు డ్రగ్స్ తీసుకోలేదని ప్రకటించాలని కంగనా డిమాండ్ చేయడం విశేషం. అంతేకాదు తాను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే.. ముంబై విడిచిపోతానని ప్రగల్భాలు పోయినా, తాను మత్తుమందులకు బానిసనంటూ గతంలో వాపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంగన మౌనాన్ని ఆశ్రయించక తప్పలేదు. బాలీవుడ్ లో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్ ని నీళ్లలాగే వాడేస్తున్నారన్న కంగనా వ్యాఖ్యలు సృష్టించిన దుమారం దాదాపు అన్ని వుడ్ లను చుట్టేస్తోంది. మాదకద్రవ్యాల మాఫియాతో 20 మంది కన్నడ నటీ నటులకు లింకులున్నాయని బెంగళూరు పోలీసులే నిర్ధారించారు. ఇక 2017లో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం రేపిన సంచలనాన్ని ఎలా మర్చిపోగలం. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పూరీ జగన్నాథ్, రవితేజ, ఛార్మీ సుబ్బరాజు, నవదీప్, తరుణ్, మొమైత్ ఖాన్ తదితరులు విచారణకు హాజరైన వారేకదా. ఈ సందర్భంగా నటి మాధవీలత తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డునుద్దేశించి చేసిన విజ్ఞప్తిని ప్రస్తావించుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ లేని పార్టీలు లేవనీ, కాలేజీ విద్యార్థులపై నిఘా పెట్టాలని ఆమె కోరారు. బాలీవుడ్, టాలీవుడ్ శాండిల్‌వుడ్ లను డ్రగ్స్ దుమారం గతంలో పట్టి కుదిపేయలేదా? డ్రగ్స్ మాఫియా పరిశ్రమను ఏలుతోందనేది ఎప్పటినుంచో ఉన్న ఆరోపణే. అయితే ఎవరో ఒకరో ఇద్దరో చేసిన పనికి అందరిపైనా విమర్శలు సరికాదంటూ ఇండస్ట్రీ పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాకు అంతర్జాతీయ స్థాయిలో లింకులు ఉన్నాయని, ఈ మేరకు దర్యాప్తు సంస్థ ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో)కి ఆధారాలు డ్రగ్ మాఫియా కోరల ప్రభావాన్ని చెప్పకనే చెబుతున్నాయి. విలాసంగా, సరదాగా గంజాయి నుంచి మొదలైన గమ్మత్తైన మత్తునుంచి అతిప్రమాదకరమైన డ్రగ్స్ వైపునకు మళ్లుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన డ్రగ్స్ హెరాయిన్, కొకైన్, ఎల్ఎస్డీ, డీవోబీ, వీడ్ (గంజాయి) లాంటివి ఇపుడు కాలేజీ విద్యార్థులకు సైతం కాలేజీ క్యాంటీన్లు, హాస్టళ్లలో దొడ్డిదారిన సులువుగా దొరుకుతున్నాయనేది జగమెరిగిన సత్యం. దేశంలోని మెట్రో నగరాల్లో రేవ్ పార్టీలు, పబ్ కల్చర్, రేసింగులు, బెట్టింగులు లాంటి అతి వినాశకరమైన సంస్కృతిని పెంచి పోషిస్తోందీ డ్రగ్ మాఫియా. శ్రీలంక, దక్షిణాఫ్రికా, నైజీరియాదేశాల మాస్టర్ మైండ్స్ అండతో అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపార లింకులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల సెప్టెంబర్1న 970 గ్రాముల హెరాయిన్ పార్శిల్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణల ఆధారంగా అంతర్జాతీయ ముఠాను ఛేదించారు. ఎన్సీబీ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, మొత్తం భారతదేశం అంతా ఒక సిండికేట్‌గా దందా నిర్వహిస్తున్నారు. ఇండో-నైజీరియన్ డ్రగ్ సిండికేట్ ఫ్రాంక్ ప్రధాన సూత్రధారిగా విదేశాల్లో ఉంటూనే దేశ రాజధాని నగరం డిల్లీ కేంద్రంగా మొత్తం సిండికేట్‌ను నిర్వహిస్తున్నాడు. నకిలీ, చట్టవిరుద్ధ గుర్తింపు కార్డులే వీరి మోడెస్ ఒపరాండీ. డ్రగ్స్ కేసు, బాలీవుడ్ స్టార్ల ప్రమేయం డ్రగ్స్ కోణం నుంచి దర్యాప్తులో రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండా, దీపేష్ సావంత్, మరికొంతమంది డ్రగ్ వ్యాపారులను ఇప్పటికే అరెస్టు చేసింది. ముఖ్యంగా ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన గతకొన్ని రోజులుగా కేవలం బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు మాత్రమే ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా అగ్రహీరో మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్, బాలీవుడ్లో సారా అలీఖాన్, దీపికా పదుకోన్, దియా మీర్జా, శ్రద్ధా కపూర్ లాంటి వారి పేర్లు బయటికి రావడం పెద్ద సెన్సేషన్‌గా మారింది. అటు హీరోయిన్లు స్లిమ్‌గా మారేందుకు డ్రగ్స్‌ను ఆశ్రయిస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. తాజా పరిణామం అనంతరం బాలీవుడ్ సూపర్ హీరోలపై ఆసక్తికర చర్చకు దారితీసింది. మొత్తం దేశీయ సినీ పరిశ్రమలోగానీ, బాలీవుడ్ హీరోల్లో గానీ డ్రగ్స్ వాడేవారే లేరా? మత్తు మందులు, ధూమపానం లాంటి చెడు అలవాట్లుకు బానిసలైన హీరోలు లేరా? వారికి నేరచరిత్ర ఆరోపణలు లేవా? డ్రగ్ మాఫియా లింకులు లేవా? లాంటి ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఇది ఇలా ఉంటే అటు రియా ద్వారాగానీ, ఇటు టాలెంట్ మేనేజర్ జయా సాహా ద్వారా ఇంకెంతమంది గుట్టు రట్టు కానుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా సుశాంత్ ఆత్మహత్య తరువాత జస్టిస్ ఫర్ సుశాంత్ అనేది పక్కకుపోయింది. ఉన్నదల్లా ఆరోపణలు.. ప్రత్యారోపణలు..సవాళ్లు.. ప్రతి సవాళ్లు... ట్విస్ట్ అండ్ టర్న్స్. ఒక అనుమానాస్పద మరణం కేసులో ఇన్ని రాజకీయ, నాటకీయ పరిణామాలు, సంచలన ట్విస్టులు బహుశా ఇదే మొదటి సారి. (సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు) -
రియాకు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ
కోలకతా: నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు, మాదక ద్రవ్యాలు వినియోగించారనే ఆరోపణలపై అరెస్టయిన నటి రియా చక్రవర్తికి కాంగ్రెస్ పార్టీ తమ మద్దతును కొనసాగిస్తోంది. రియాకు అండగా శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతాలో ఆ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. రియాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేయడంపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ఇప్పటికే మండిపడుతోంది. రియా బెంగాలీ బ్రాహ్మణ అమ్మాయి అని, ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అని, ఆయన దేశానికి సేవ చేశారంటూ ఇటీవల ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పద మరణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ఆత్మహత్యకు అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో నెపోటిజం ఆరోపణలు చేసిన మరో హీరోయిన్ కంగనా రనౌత్ ఈ కేసులో కీలకంగా మారింది. మానసిక అనారోగ్యం, నెపోటిజం..ఇలా రోజుకో పరిణామం మధ్య ఈ కేసు తాజాగా డ్రగ్ మాఫియా తుట్టెను కదుపుతోంది. అటు ఈ కేసు రాజకీయ టర్న్ తీసుకుని, బీజేపీ శివసేన మధ్య సెగలు పుట్టిస్తోంది. బిహార్, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈకేసుపై సీబీఐ విచారణ జరుపుతోంది. (డ్రగ్స్ కేసులో రియాకు షాక్) -
డ్రగ్స్ కేసులో రకుల్, సారా పేర్లు?
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి ఉన్నతాధికారుల విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకునే అలవాటున్న మరికొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల గుట్టు బయటపెట్టినట్లు సమాచారం. వీరిలో ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబట్ట పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రియా వెల్లడించిన దాదాపు 25 మంది పేర్లతో ఎన్సీబీ అధికారులు ఓ లిస్టు తయారు చేసినట్లు, డ్రగ్స్ వాడకంతో సంబంధం ఉన్న బాలీవుడ్ ప్రముఖులందరిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ( జైల్లో రియాకు కనీసం ఫ్యాన్, బెడ్ కూడా లేదా..) కాగా, సెప్టెంబర్ 8 నార్కోటిక్స్ కేసులో అరెస్టయిన రియా, ఆమె సోదరుడు షోవిక్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. వీరి పిటిషన్లపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్, సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి జీబీ గురావ్ విచారణ చేపట్టారు. -
డ్రగ్స్ కేసులో రియాకు షాక్
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రియాతోపాటు ఇదే కేసులు, ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరి పిటిషన్లపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్, సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి జీబీ గురావ్ విచారణ చేపట్టారు. తనను ఈ తప్పుడు కేసులో ఇరికించారని రియా తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్సీబీ విచారణ సమయంలో చేసిన నేరాంగీకార ప్రకటనను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఎన్సీబీ అధికారులు తనను ఈ కేసులో ఇరికించేలా బలవంతంగా ఒప్పించారని ఆరోపించారు. సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటున్న విషయం రియాకు, ఆమె సోదరుడు షోవిక్‌కు తెలుసుననీ, సుశాంత్ చెప్పిన మేరకు వారిద్దరూ డ్రగ్స్ కొనుగోలు, చెల్లింపులు చేసినందున ఈ బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని ఎన్సీబీ వాదించింది. సుశాంత్ సింగ్, రియా చెప్పిన విధంగానే సుశాంత్ పనిమనిషి దీపేశ్ సావంత్ డ్రగ్స్ కొనుగోలు చేశాడనీ, ఈ విషయం అతడు కూడా అంగీకరించినట్లు ఎన్సీబీ పేర్కొంది. -
బంగారం స్మగ్లింగ్ మంచిది.. చాలా ఈజీ!
జైపూర్: ముల్లును ముల్లుతోనే తీసేయాలన్న సామెతకు ఆ ఎమ్మెల్యే విచిత్రమైన అర్థం చెప్పారు. మాదకద్రవ్యాల జోలికి పోవద్దని ప్రజలను హెచ్చరించే క్రమంలో.. డ్రగ్స్ కంటే గోల్డ్ స్మగ్లింగ్ ఉత్తమమని సలహాఇచ్చారు! అవికాస్తా సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని బిలారా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న బీజేపీ ఎమ్మెల్యే అర్జున్ లాల్ గార్గ్.. ఇటీవల ఓ ఆలయంలో దేవాసి తెగ పెద్దలతో సమావేశమయ్యారు. డ్రగ్స్ స్మగ్లిగ్ చేస్తూ పట్టుబడుతోన్నవారిలో ఈ(దేవాసి) తెగవారి సంఖ్య పెరిగిపోవడంపై ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘డ్రగ్స స్మగ్లింగ్‌లో బిష్ణోయ్ తెగలను మీరు(దేవాసీలు) మించిపోతున్నారు. దోనంబర్ దందా (అక్రమ వ్యాపారం) చేసుకోవాలనుకుంటే చేసుకోండిగానీ డ్రగ్స్ జోలికి మాత్రం పోవద్దు. దానికంటే గోల్డ్ స్మగ్లింగ్ చాలా సులభం. పైగా బెయిల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది’’ అని అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ (ఎన్డీపీఎస్) చట్టం కింద అరెస్టై జైళ్లలో మగ్గుతున్న దేవాసీల వివరాలు కోరుతూ శాసన సభలో ప్రశ్నించానని, మత్తుమందుల వినియోగం, అక్రమ రవాణాల కారణంగా దేవాసీ యువత పనికిరాకుండాపోతున్నారని ఎమ్మెల్యే అర్జున్ గార్గ్ తెలిపారు. కాగా, రాజస్తాన్‌లోని బిష్ణోయ్, దేవాసి తదితర తెగలకు సరైన ఉపాధి కల్పించడంలో బీజేపీ సర్కార్ విఫలం చెందిందనడానికి ఎమ్మెల్యే వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపై ఎమ్మెల్యే గార్గ్ స్పందించాల్సిఉంది. బిలారా బీజేపీ ఎమ్మెల్యే అర్జున్ లాల్ గార్గ్(ఫైల్)