నగదు రూ.99.16 కోట్లు స్వాధీనం
92.2 కిలోల బంగారం, 178.6 కిలోల వెండి పట్టివేత
వెల్లడించిన డీజీపీ కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 16 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన సోదాల్లో రూ.200,27,60,036 విలువైన నగదు, మద్యం, మత్తుపదార్థాలు, బంగారం, వెండి, ఇతర విలువైన పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో నగదు రూ.99,16,15,968 పట్టుబడినట్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 466 ఫ్లయింగ్ స్వాడ్‌లు, 89 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో తనిఖీలు కొనసాగాయి.
సోదాల్లో రూ.11,48,00,955 విలువైన మద్యం పట్టుబడింది. రూ.14,52,53,412 విలువైన నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 92.271 కిలోల బంగారం, 178.657 కిలోల వెండి పట్టుబడింది. ఇవికాకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెచ్చిన మరో రూ.11,91,06,661 విలువైన వస్తువులు ఉన్నాయి. ఇక 7,272 లైసెన్స్ కలిగిన ఆయుధాలను, మరో 20 లైసెన్స్‌లేని ఆయుధాలను జప్తు చేసినట్టు డీజీపీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సోదాల్లో నగదు, మద్యం, మత్తుపదార్థాలు, బంగారం, వెండి, ఇతర వస్తువులు కలిపి రూ.46.3 కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment