Cash seizures
-
ఎన్నికల్లో పట్టివేతలు : రూ.200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 16 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన సోదాల్లో రూ.200,27,60,036 విలువైన నగదు, మద్యం, మత్తుపదార్థాలు, బంగారం, వెండి, ఇతర విలువైన పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో నగదు రూ.99,16,15,968 పట్టుబడినట్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 466 ఫ్లయింగ్ స్వాడ్లు, 89 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో తనిఖీలు కొనసాగాయి.సోదాల్లో రూ.11,48,00,955 విలువైన మద్యం పట్టుబడింది. రూ.14,52,53,412 విలువైన నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 92.271 కిలోల బంగారం, 178.657 కిలోల వెండి పట్టుబడింది. ఇవికాకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెచ్చిన మరో రూ.11,91,06,661 విలువైన వస్తువులు ఉన్నాయి. ఇక 7,272 లైసెన్స్ కలిగిన ఆయుధాలను, మరో 20 లైసెన్స్‌లేని ఆయుధాలను జప్తు చేసినట్టు డీజీపీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సోదాల్లో నగదు, మద్యం, మత్తుపదార్థాలు, బంగారం, వెండి, ఇతర వస్తువులు కలిపి రూ.46.3 కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టు వెల్లడించింది. -
586 చోట్ల దాడులు.. భారీగా నగదు పట్టివేత
-
586 చోట్ల దాడులు.. భారీగా నగదు పట్టివేత
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో భారీగా నగదు పట్టుబడింది. మొత్తం 586 ప్రాంతాల్లో జరిపిన సెర్చింగ్ ఆపరేషన్‌లో దాదాపు రూ.3000 కోట్లు వెలుగులోకి వచ్చినట్టు ఐటీ శాఖ వెల్లడించింది. దానిలో రూ.79 కోట్లు కొత్త కరెన్సీ రూ.2000 నోట్లు కాగ, మిగతా రూ.2,600 కోట్లు లెక్కలో చూపనివని తెలిసింది. పట్టుబడిన నగదులో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో పట్టుబడింది. చెన్నై వ్యాప్తంగా ఏకకాలంలో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో రూ.100 కోట్లకు పైగా నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తంగా రూ.140 కోట్లు పట్టుబడినట్టు తెలిసింది. నగదుతో పాటు రూ.52 కోట్ల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా ఢిల్లీలోని ఓ న్యాయవాది ఇంటి ప్రాంగణంలో జరిపిన తాజా తనిఖీలో రూ.14 కోట్ల నగదు పట్టుబడింది. గత అక్టోబర్‌లో లెక్కలో చూపని నగదు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయపు వెల్లడి పథకం కింద ఆ లాయరే దాదాపు రూ.125 కోట్లను తను లెక్కలో చూపని నగదుగా ప్రకటించారు. రెండు వారాల క్రితం అతని బ్యాంకు అకౌంట్లను తనిఖీ చేసిన ఐటీ అధికారులు అకౌంట్ నుంచి లెక్కల్లో చూపని రూ.19 కోట్లను సీజ్ చేశారు. ఐటీ అధికారుల దాడులతో బుధవారం పుణేలోని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ఒక వ్యక్తికి సంబంధించిన 15 లాకర్స్ వివరాలను వెల్లడించింది. ఆ 15 లాకర్స్‌లో రూ.9.85 కోట్ల నగదు ఉందని, వాటిలో రూ.8 కోట్లు కొత్త రూ.2000 కరెన్సీ నోట్లని, మిగతావి రూ.100 నోట్లని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది. గత నెలకు సంబంధించిన బ్యాంకు రికార్డులు, సీసీటీవీ పరిశీలించిన బ్యాంకు అధికారులకు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద పెద్ద బ్యాగులతో బయటికి వెళ్లడం, లోపలికి రావడం దానిలో రికార్డు అయ్యాయి. దీంతో బ్యాంకు అధికారులపై సీరియస్ అయిన ఐటీ శాఖ, విచారణ చేపట్టింది. మొత్తంగా పుణే వ్యాప్తంగా జరిపిన ఐటీ దాడుల్లో రూ.10.80 కోట్ల నగదు పట్టుబడింది. వాటిలో రూ.8.8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లున్నాయని ఐటీ అధికారులు తెలిపారు.. -
దిమ్మతిరిగేరీతిలో వెలుగులోకి నల్లధనం
ఒకేరోజు పట్టుబడ్డ 32 కోట్ల కొత్త కరెన్సీ.. 82 కిలోల బంగారం! పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఒకవైపు కనీస అవసరాలకు నగదు దొరకకు సామాన్యలు అవస్థలు పడుతుండగా.. మరోవైపు నల్లధన కుబేరుల వద్ద దిమ్మతిరిగేరీతిలో కొత్త కరెన్సీ కట్టలు దొరకుతూనే ఉన్నాయి. ఒక్క శనివారమే దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఏకంగా 44 కోట్ల నగదు, 82 కిలోల బంగారం దొరికింది. ఇందులో 32 కోట్లు తళతళ మెరిసే కొత్త నోట్లే కావడం గమనార్హం. ఢిల్లీ పోలీసులు శనివారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని టీ అండ్ టీ న్యాయసేవల సంస్థపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఏకంగా రూ. 13.65 కోట్లు పట్టుబడ్డాయి. ఇందులో రూ. 2.6 కోట్లు కొత్త కరెన్సీ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ సంస్థ ప్రమోటర్ రోహిత్ టండన్ గురించి పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటకలో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో 5.7 కోట్ల నగదు, 32 కిలోల బంగారం వెలుగుచూసింది. చల్లకెరే పట్టణంలోని ఓ హవాలా డీలర్ ఇంట్లోని రహస్య బాత్రూమ్ చాంబర్లో ఈ నగదు, బంగారం వెలుగుచూడటం గమనార్హం. ఇందులో 90 లక్షలు రద్దైన పాతనోట్లు కాగా మిగతా అంత కొత్త కరెన్సీ నోట్లే. ఇక గోవా పనాజీలోని ఐటీ విభాగం అధికారులు హుబిలీ, చిత్రదుర్గ జిల్లాల్లోని బులియన్, క్యాసినో వ్యాపారుల ఇళ్లపై దాడులు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఐటీ అధికారుల అదుపులో ఉన్న టీటీడీ సభ్యుడు, తెలుగు వ్యాపారవేత్త శేఖర్‌రెడ్డికి సంబంధించి నల్లధనం వెలుగుచూస్తేనే ఉంది. తమిళనాడు వేలూరులో ఓ కారులో ఐటీ అధికారులు రూ. 24 కోట్లు, 50 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఐటీ దాడుల్లో నల్లధనం పట్టుబడటంతో శేఖర్‌రెడ్డిని, ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్టైన ముగ్గురు వ్యక్తులు విచారణలో ఇచ్చిన సమాచారంతో శేఖర్‌రెడ్డికి సంబంధించిన ఈ నల్లధనాన్ని పట్టుకున్నారు. శుక్రవారం శేఖర్‌రెడ్డికి సంబంధించిన రూ. 90 కోట్లు నగదు (ఇందులో రూ. 9.63 కోట్లు రెండువేల నోటు రూపంలో ఉన్న కొత్త కరెన్సీ), 127 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దనోట్ల రద్దు తర్వాత అత్యధికమొత్తంలో నల్లధనం పట్టుబడింది ఈ కేసులోనే కావడం గమనార్హం.