సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్త నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో సోదాలు చేపట్టారు. జీవీ సలూజా ఆసుపత్రిలో భారీగా నార్కోటిక్ డ్రగ్స్ సీజ్ చేశారు.
మౌలాలీలోని నేహా భగవత్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు నార్కోటిక్ డగ్ర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేహా భగవత్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
పెద్దమొత్తంలో సలూజా ఆసుపత్రిలో మత్తుమందును యాజమాన్యం నిల్వచేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా మత్తు మందుని దిగుమతి చేసి ఆసుపత్రి యాజమాన్యం విక్రయిస్తోంది. మహారాష్ట్రకు చెందిన నేహా భగవత్ సాయంతో మత్తు మందులు విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment