అర్మాన్ కోహ్లీ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన నివాసంలో ఎన్‌సీబీ దాడులు నిర్వహించింది. అనంతరం ఆగస్టు 30 వరకు ఎన్‌సీబీ కస్టడీకి తరలించారు.
ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో శనివారం కోహ్లీ నివాసంలో విస్తృత దాడులు జరిగాయి.ఈ దాడుల్లో కోహ్లీ ఇంటి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరింత సమాచాం కోసం ప్రశ్నించేందుకు ఆయనను ఎన్‌సీబీ అదుపులోకి తీసుకుంది. కాగా 2018లో చట్టవిరుద్ధంగా మద్యం నిల్వ చేశాడన్న ఆరోపణలపై కోహ్లీని ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసింది. బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గా ఉన్నాడు కోహ్లీ.
Comments
Please login to add a commentAdd a comment