
తమన్నా.. ఇది ఇప్పుడు పేరు కాదు. గ్లామర్‌కు బ్రాండ్. అదీ హైపర్ బ్రాండ్. ఎక్కడైనా, ఎప్పుడైనా తన ప్రత్యేకతను చాటుకోవాల్సిందే, వార్తల్లో మారుమోగాల్చిందే. దట్ ఇస్ మిల్కీ బ్యూటీ. ఇటీవల జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా పాటలో విజృంభించి అందాలను ప్రదర్శించిన తమన్నకు ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. కాగా ఇప్పటివరకు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటిగా తన సత్తాను చాటుకున్న తమన్న తాజాగా తన పేరును మాలీవుడ్ కు విస్తరింపచేసుకుంది. అక్కడ పాదం మోపింది లేదో మాలీవుడ్ హీరోయిన్లకు దడ పుట్టించింది.
నటుడు దిలీప్ కథానాయకుడుగా నటించిన బాంద్రా అనే చిత్రంతో తమన్నా కథానాయకిగా మలయాళం చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్ లో నటుడు దిలీప్ పేర్కొంటూ ఈ చిత్ర కథ పూర్తి అయిన తర్వాత ఇందులో ఇప్పటివరకు మలయాళంలో నటించని, తనతో జతకట్టని నటిని హీరోయిన్‌గా నటింపజేయాలని భావించారన్నారు. దీంతో చాలా గట్స్ కలిగిన ఈ పాత్రకు నటి తమన్నా అయితే బాగుంటుందని అనిపించిందన్నారు. దర్శకుడు అరుణ్ గోపీ ఎలాగో తమన్నాకు కథ వినిపించి ఆమె అనుమతి పొందారన్నారు.
అయితే చిత్ర ప్రారంభోత్సవ పూజ వరకు ఆమె ఇందులో నటిస్తారనే నమ్మకం తనకు లేదన్నారు. మరో విషయం ఏమిటంటే ఇందులో తమన్నా కాకుండా మరో ముఖ్యపాత్ర ఉందని ఆ పాత్రలో నటింప చేయడానికి పలువురు నటీమణులను సంప్రదించగా, తమన్నా ఉంటే చిత్రంలో తాము కనిపించమని భావించి ఇందులో నటించడానికి నిరాకరించారన్నారు. ఇలా తొలి చిత్రంతోనే మిల్కీ బ్యూటీ మాలీవుడ్ హీరోయిన్ల గుండెల్లో దడ పుట్టించిందన్నమాట. అయితే నటి మమతా మోహన్ దాస్ ఆ చిత్రంలో మరో పాత్ర నటించడానికి ధైర్యంగా ముందుకు వచ్చిందట.
:
Comments
Please login to add a commentAdd a comment