
ముంబై: నగరంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని బెహ్రంపాడ మురికివాడల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 16 ఫైర్‌ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకొని అంధకారం ఆవహించింది. అయితే ఈ ప్రమాదంలో రైల్వే లైన్లకు, రైలు సర్వీసులకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని అధికారులు తెలిపారు.






Comments
Please login to add a commentAdd a comment