
టీమిండియా బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పృథ్వీ షా ఖరీదైన ఇల్లు కొన్నాడు. దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని బాంద్రాలో సముద్ర ముఖంగా ఉన్న ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
తన లగ్జరీ ఫ్లాట్‌కు సంబంధించిన ఫొటోలను పృథ్వీ షా మంగళవారం షేర్ చేశాడు. ‘‘నాకంటూ ఓ సొంత ప్రదేశం. అందుకోసం ఎంతగానో శ్రమించి ఇప్పుడు ఇలా ఇక్కడ అడుగుపెట్టడం ఎంతో ప్రత్యేకం.
ఈ ప్లేస్ గురించి కలలగనడం.. ఇప్పుడు ఇక్కడ వాటిని నిజం చేసుకోవడం.. నాకంటూ సొంత ఇల్లు.. స్వర్గం లాంటిది! ఇక ముందు అంతా మంచే జరగాలి’’ అంటూ ఉద్వేగపూరిత నోట్ రాశాడు పృథ్వీ షా. ఈ ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
కాగా టీమిండియా ఓపెనర్‌గా అరంగేట్రంలోనే అదరగొట్టిన ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. ఆ తర్వాత తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అనంతరం దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టినా మళ్లీ సెలక్టర్ల పిలుపు అందుకోలేకపోయాడు.
ఇక ఇటీవల గాయంతో సతమతమైన పృథ్వీ షా రంజీ బరిలో దిగి.. ముంబై ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్-2024 సీజన్‌తో ఈ ఓపెనింగ్ బ్యాటర్ బిజీగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి 119 పరుగులు సాధించాడు. కాగా ఢిల్లీ ఫ్రాంఛైజీ పృథ్వీ షా కోసం రూ. 8 కోట్లు చెల్లించింది.
చదవండి: #Klaasen: గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా మెరుపు స్టంపింగ్! వీడియో
Comments
Please login to add a commentAdd a comment