ఐపీఎల్-2024 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఘనంగా ఆరంభించాడు. ఈ ఏడాది సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన పృథ్వీ షా.. ఆదివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌కు ఢిల్లీ తుది జట్టులోకి వచ్చాడు. తనకు వచ్చిన అవకాశాన్ని పృథ్వీ షా సద్వినియోగ పరుచుకున్నాడు.
షా అద్బుతమైన ఇన్నింగ్స్‌తో ఢిల్లీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు,2 సిక్స్‌లతో అతడు 43 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఢిల్లీ జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు ఈ ముంబైకర్. ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా తనలో ఉన్న బాధనంతా తన ఇన్నింగ్స్ రూపంలో చూపించాడని సెహ్వాగ్ అన్నాడు.
"ప్రతీ టీమ్ మేనేజ్‌మెంట్ తమ ఆటగాడు రిథమ్‌లో ఉన్నాడా లేదా నెట్స్‌లో ఎప్పుడూ పరిశీలిస్తుంటుంది. ఈ ఇన్నింగ్స్ పృథ్వీకి చాలా ముఖ్యమైనది. గత సీజన్‌లో కూడా పెద్దగా జట్టులో షా కన్పించలేదు. ఈ ఏడాది సీజన్‌లో కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. ఈ విషయంలో అతడు బాధపడి ఉండవచ్చు. అందుకే తన బాధను ఆట రూపంలో చూపించాడని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment