54 సార్లు పొడిచి.. గొంతుకోసి స్టేషన్‌కు | 18 year old stabbed 54 times by his friend | Sakshi
Sakshi News home page

54 సార్లు పొడిచి.. గొంతుకోసి స్టేషన్‌కు

Published Fri, Mar 23 2018 11:46 AM | Last Updated on Fri, Mar 23 2018 11:46 AM

18 year old stabbed 54 times by his friend - Sakshi

హత్యకు సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం

బాంద్రా : ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. తన ముందు పదే పదే ఆంగ్లంలో మాట్లాడి తనను అవమానించాడనే అక్కసుతో స్నేహితుడిని హత్య చేశాడు ఓ యువకుడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 54 సార్లు కత్తితో పాశవికంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అతడి గొంతును చీల్చాడు. ఈ భయానక సంఘటన గత బుధవారం చోటు చేసుకున్నప్పటికీ నిందితుడు పోలీసులకు నేరుగా లొంగిపోయిన తర్వాతే తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

మహ్మద్‌ అమిర్‌ అబ్దుల్‌ వహీద్‌ రహిన్‌ (21), మహ్మద్‌ అఫ్రాజ్‌ అలాం షేక్‌ (18) ఇద్దరు స్నేహితులు. అయితే, అఫ్రాజ్‌ పలుమార్లు రహిన్‌ ముందు ఆంగ్లంలో మాట్లాడుతూ హేళన చేశాడట. దాన్ని అవమానంగా భావించిన రహిన్‌ ఎలాగైనా అఫ్రాజ్‌ను హత్య చేయాలనుకున్నాడు. అందుకోసం వారం రోజులపాటు ఆలోచించి ప్లాన్‌ వేసుకున్నాడు. బుధవారం బయటకు వెళ్లి సరదాగా కూల్‌ డ్రింక్‌ తాగి వద్దామని తీసుకెళ్లాడు. అనంతరం తనతో తెచ్చుకున్న కత్తితో గొంతుకోసం చనిపోయాడని నిర్ధారించుకునే వరకు 54సార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో స్టేషన్‌కు వెళ్లి రహిన్‌ లొంగిపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement